Twin Sisters: కవలలుగా పుట్టిన అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే వ్యక్తిని పెళ్లాడిన సంఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. షోలాపూర్ జిల్లా మల్షిరాస్ తాలూకాకు చెందిన అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే వివాహ వేదికపై ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వరుడు అతుల్ స్వస్థలం షోలాపూర్ కాగా కవల వధువులు రింకీ, పింకీ ముంబైలోని కండివాలికి చెందినవారు. అతుల్‌కు ట్రావెల్ ఏజెన్సీ ఉండగా.. కవల సోదరీమణులు ముంబైలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట తండ్రి మరణించగా ప్రస్తుతం తల్లితో…