Financier attacked with knife at Attapur Police Station: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ లో ఆటోమొబైల్ ఫైనాన్షియర్స్ రెచ్చిపోయాడు. ఓ వాహనదారుడి పై కత్తి తో దాడికి దిగాడు. వారిని ప్రతిఘటించిన వాహనదారుడు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశాడు. పోలీస్టేషన్ వద్ద ఫైనాన్షియర్స్ కత్తితో నానా హంగామా చేశాడు. పోలీసులు ఎదురుగా వున్న పోలీస్ స్టేషన్ లో వాహనదారుడిపై దాడికి పాల్పడ్డాడు ఫైనాన్షియర్స్. పోలీసులు అడ్డుకుంటున్నా ఫైనాన్షియర్ పట్టించుకోలేదు పోలీసులను సైతం పక్కనపెట్టాశాడు. తను పోలీస్టేషన్ లో వున్నానన్న సంగతి సైతం మరిచాడు. వాహన దారుడిపై దాడికి పాల్పడ్డాడు. దాడిలో ఓ మైనర్ బాలుడు తీవ్ర గాయపడ్డాడు. తీవ్ర గాయాలైన బాలుడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే ఇక్కడే ట్వీస్ట్ ఏర్పడింది. వాహనదారుడు, ఫైనాన్షియర్ మాట ఏమోకానీ ఇందులో వర్గం అంటూ పోలీస్ స్టేషన్ లో హంగామా వచ్చింది. ఓ వర్గానికి చెందిన వారిని దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్న ఇరువర్గాలు. దీంతో పోలీస్టేషన్ వద్ద ఇరువర్గాలు గుమ్మి గూడడంతో కాప్స్ ఎంట్రీ ఇచ్చారు ఇరువర్గాలను చెదర గొట్టారు. దీంతో.. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Read also: Astrology : డిసెంబర్ 05, సోమవారం దినఫలాలు
అయితే.. వాహనం సీజింగ్ పేరుతో అడ్డగించి కత్తితో దాడి చేశారంటూ బాధితులు నిస్సార్ ఖాన్ ఫిర్యాదు చేశాడు. నిస్సార్ ఖాన్ మోటర్ సైకిల్ కిస్తిలు కట్టక పోవడంతో అడ్డగించి అడిగితే తమపై దాడి చేశారంటూ ఫిర్యాదులు అందాయని అన్నారు. వాహనాల సీజింగ్ పేరుతో నెంబర్ ప్లేట్ లేని మోటర్ సైకిళ్లపై ఆటో మొబైల్ ఫైనాన్షియర్స్ తిరుగుతూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి పై చర్యలు తీసుకోవాలంటున్న బాధితులు కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Shakib Al Hasan: టీమిండియాపై బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ అరుదైన రికార్డు