Anna University Case: తమిళనాడులో సంచలనం సృష్టించిన 19 ఏళ్ల అన్నా యూనివర్సిటీ విద్యార్థిని అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువడింది. స్థానికంగా బిర్యానీ విక్రేత అయిన నిందితుడు జ్ఞానశేఖరన్‌కు జీవిత ఖైదు విధించబడింది. విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడినందుకు చెన్నైలోని మహిళా కోర్టు నిందితుడికి శిక్షను ఖరారు చేసింది. జీవిత ఖైదుతో పాటు రూ. 90,000 జరిమానా విధించింది.
తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్.రవిని బీజేపీ మహిళా నేతలు కలిశారు. అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు.
Tamil Nadu: ఈరోజు (డిసెంబర్ 30) మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిను తమిళక వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ కలవనున్నారు.
Anna University Case: చెన్నై అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన తమిళనాడులో పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార డీఎంకే పార్టీ కార్యకర్త నిందితుల్లో ఒకరని బీజేపీ ఆరోపిస్తోంది. ఇందుకు సాక్ష్యాంగా స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్‌తో ఉన్న నిందితుడి ఫోటోలను షేర్ చేసింది. ఇదిలా ఉంటే అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసును మద్రాస్ హైకోర్టు సుమోటోగా తీసుకుంది.
తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై ఆరు కొరడా దెబ్బలు కొట్టించుకుని.. మురుగన్‌కు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ.. రాష్ట్రంలో స్టాలిన్ సర్కార్ ను గద్దె దించేందుకు ఇవాళ్టి నుంచి 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేస్తానని శపథం చేశారు.
Anna University: చెన్నై అన్నా యూనివర్సిటీలో దారుణం జరిగింది. యూనివర్సిటీలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడి చేశారు.
ప్రపంచంలోని టాప్ 150 విశ్వవిద్యాలయాలలో IIT బాంబే, IIT ఢిల్లీ ఉన్నాయి. వరుసగా 13 సంవత్సరాలుగా మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రపంచంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. ఈ నేపథ్యంలో లండన్ కు చెందిన ఉన్నత విద్యా విశ్లేషణ సంస్థ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025 పేరుతో ఓ నివేదికను ప్రచురించింది. ఐఐటీ ముంబై గతేడాది 149వ స్థానంలో ఉండగా.. ఈసారి 31 స్థానాలు ఎగబాకి 118వ ర్యాంక్ కు చేరుకుంది. 2024…