తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన కేసు సంచలనం సృష్టించింది.. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ కొనసాగిస్తుండగా.. సిట్ నోటీసులు ఇచ్చినవారు కొందరు విచారణకు డుమ్మాకొడుతున్నారు.. అయితే, ఈ కేసులో సిట్ దర్యాప్తు చేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలని కేరళ బీడీజెస్ అధ్యక్షుడు తుషార్.. కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని విన్నవించారు..
Read Also: IT Raids on Malla Reddy Case: తొలిరోజు ముగిసిన విచారణ.. మరో 10 మందికి నోటీసులు
రాజకీయ అజెండా మేరకే సిట్ దర్యాప్తు చేస్తోందని పిటిషన్‌లో పేర్కొన్న తుషార్.. ఈనెల 21న విచారణకు రావాలని 16వ తేదీన తనకు 41ఏ నోటీసు ఇచ్చారని.. అనారోగ్యం కారణంగా.. వైద్యుల సూచనల మేరకు రెండు వారాల గడువు కోరినట్టు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, తన మెయిల్‌కు రిప్లై ఇవ్వకుండా లుక్ అవుట్ నోటీసు ఇవ్వడం రాజకీయ దురుద్దేశమేనని ఆవేదన వ్యక్తం చేశారు తుషార్.. కాగా, ఈ కేసులో తుషార్, జగ్గుస్వామిలకు సిట్ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.. వారు దేశం విడిచి పోకుండా అన్ని విమానాశ్రయాలు, ఇమ్మిగ్రేషన్ అధికారులు, అంతర్జాతీయ సరిహద్దుల్లోని అధికారులకు సర్క్యులర్లు పంపిన విషయం విదితమే. ఇప్పుడు తుషార్.. కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో.. ఈకేసు ఎలాంటి మలుపు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.