Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్‌పై ట్రంప్ సంచలన ఆరోపణలు
- భారత నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడి..
- సంచలన ఆరోపణ చేసిన ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. హార్ముజ్ జలసంధి నుంచి వెళ్తున్న భారతీయ నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడం ‘‘పూర్తిగా ఆమోదయోగ్యం కాదు’’ అని అన్నారు. శుక్రవారం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత నౌకలపై దాడులతో పాటు అమెరికా-ఇరాన్ మధ్య ప్రతిపాదిత ఒప్పందం విషయంలో కూడా ట్రంప్ స్పందించారు. ఇరాన్ విడుదల చేసిన ఒప్పంద వివరాలు వాస్తవానికి భిన్నంగా ఉన్నాయని, నిజమైన ఒప్పందంలోని అంశాలు కాదని ఆయన అన్నారు. ఇరాన్‌తో మంచి ఒప్పందం కుదుర్చుకోవడం చాలా కష్టం, వారు అత్యంత విశ్వసనీయత లేని భాగస్వాములు, వెంటనే తమ వైఖరిని మార్చుకోవాలి అని ట్రంప్ హెచ్చరించారు.
ఈ వారం ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ఉన్న మూడు నౌకలపై దాడి జరిగింది. ఈ దాడులపై భారత్ తీవ్రంగా స్పందించిన తర్వాత అమెరికా నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అయితే, భారత నౌకలపై అమెరికా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు ఆరోపిస్తుండటం గమనార్హం.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఈ ఘటనపై భారత్, అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. భారతీయ వాణిజ్య నౌకలపై దాడులపై ఆందోళన వ్యక్తం చేసింది. జూన్ 08న ఎంటీ మారివెక్స్ అనే నౌకపై దాడి జరగడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ నౌకలో ఉన్న 24 మంది భారత సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. జూన్ 10న ఎంటీ సెట్టేబెల్లో అనే ట్యాంకర్ ఒమన్ తీరంలో దాడికి గురైంది. ఈ నౌకలో 24 మంది భారతీయులు ఉంటే, 21 మంది సురక్షితంగా బయటపడగా, ముగ్గురు మరణించారు. గురువారం మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!