1971లో, ఇండో-పాక్ యుద్ధం ప్రారంభమైనప్పుడు, భారత నావికాదళం ఆపరేషన్ ట్రైడెంట్ ద్వారా పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించడంలో విజయం సాధించింది. ఈ ఆపరేషన్ ప్రారంభమైన రోజు జ్ఞాపకార్థం , వివిధ ఆపరేషన్లలో ధైర్యంగా మరణించిన జవాన్లను స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ఇండియన్ నేవీ డే జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజు చరిత్ర , ప్రాముఖ్యతతో సహా పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Varun Gandhi: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తన నానమ్మ, దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై ప్రశంసలు కురిపించారు. 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో భారత విజయాన్ని ప్రస్తావిస్తూ.. నిజమైన నాయకులు విజయానికి పూర్తి క్రెడిట్ తీసుకోరు అని అన్నారు. 1971 యుద్ధంలో చారిత్రాత్మక విజయం తర్వాత అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ సామ్ మానెక్షాకు ఇందిరాగాంధీ రాసిన లేఖను వరుణ్ గాంధీ పంచుకున్నారు.
Vijay Diwas: పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్(ఇప్పటి బంగ్లాదేశ్)కి విముక్తి కల్పించడం కోసం భారత్ 1971లో యుద్ధం చేయాల్సి వచ్చింది. తూర్పు పాకిస్తాన్‌లో ఏకంగా 90,000 మంది సైనికులు భారత్ ముందు లొంగిపోయారు. ఇందిరా గాంధీ ఉక్కు సంకల్పంతో బంగ్లాదేశ్ ఏర్పడింది. భారత్‌పై పాశ్చాత్యదేశాలు, అమెరికాలు ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా.. రష్యా భారత్‌కి అండగా నిలిచింది. 90 వేల మంది పాక్ సైనికులు భారత్ ముందు మోకరిల్లిన ఈరోజున భారత్ ‘విజయ్ దివాస్’ జరుపుకుంటుంది. యాభై రెండు…