Fake Certificates: గద్వాల జిల్లా వ్యవసాయ శాఖలో నకిలీ సర్టిఫికేట్‌ల వ్యవహారం సంచలనం సృష్టించింది. ఫేక్ సర్టిఫికేట్‌లతో ఉద్యోగాలు పొందిన పలువురు అసిస్టెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు (AEO) అధికారుల గుట్టు బయటపడింది. వీరు ఉత్తరప్రదేశ్‌లో వ్యవసాయ విద్యను అభ్యసించినట్లు దొంగ డిగ్రీలు సృష్టించుకుని ఉద్యోగాల్లో చేరినట్లు గుర్తించారు. ఈ నకిలీ సర్టిఫికేట్ వ్యవహారంపై అధికారికంగా విచారణ జరుగుతోంది. ఇప్పటివరకు ఏడుగురు ఉద్యోగుల నకిలీ డిగ్రీలపై అధికారులు దృష్టి సారించి విచారణ చేపట్టారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో ఎలాంటి…
Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ట్రైనీగా ఉన్న సమయంలోనే ప్రత్యేకాధికారాలు కోరడంతో ఈమె వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 2022లో జరిగిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో ప్రత్యేక సడలింపు కోసం తప్పుడు మార్గాలకు పాల్పడినట్లు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరో కొత్త మలుపు తిరిగింది. తాజాగా ఆమె పోలీసులకు.. పూణె కలెక్టర్‌పై ఫిర్యాదు చేసింది. పూణె కలెక్టర్ సుహాస్ దివాసే తనను వేధిస్తున్నాడని పూజా కంప్లంట్ చేసింది.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంటికి సోమవారం అర్ధరాత్రి పోలీసులు వచ్చారు. సివిల్ డ్రస్‌లో ఉన్న ముగ్గురు మహిళా పోలీసులు ప్రత్యక్షమయ్యారు. గత కొద్ది రోజులుగా పూజా ఖేద్కర్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Asifabad: ఇటీవల తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. స్థానికత ఆధారంగా సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్పీ, అగ్నిమాపక విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ లో మహిళ బతికి ఉండగానే చనిపోయిందని బంధువులు భూమి కాజేసే యత్నం చేశారు. దుర్గమ్మ పేరు మీద ఉన్న 1.20 ఎకరాల భూమిని తమ పేరు మీద మార్చుకునే ప్రయత్నం చేశారు.
సర్టిఫికెట్ల కేసులో జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి నల్గొండ పోలీసుల సోదాలు నిర్వహించారు. పట్టణంలోని స్టూడెంట్ అకాడమీ ఎడ్యుకేషన్ సొసైటీలో తనిఖీలు చేశారు. పలు యూనివర్సిటీలకు సంబంధించిన పత్రాలు, మరికొన్ని సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు.