REDMAGIC Tablet 3 Pro: గేమింగ్ డివైజుల తయారీలో ప్రత్యేక స్థానం కలిగిన REDMAGIC బ్రాండ్, మరో నూతన గేమింగ్ టాబ్లెట్‌ను తీసుక వచ్చేందుకు సిద్ధమైంది. ఈ REDMAGIC Gaming Tablet 3 Pro చైనాలో జూలై 11న ఈ టాబ్లెట్‌ను లాంచ్ చేయనుండగా, అదే మోడల్‌ను గ్లోబల్ మార్కెట్‌లో REDMAGIC Astra గేమింగ్ టాబ్లెట్ గా విడుదల చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. మరి ఈ గేమింగ్ టాబ్లెట్ సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం..
ఈ టాబ్లెట్‌లో 9 అంగుళాల 2.4K OLED స్క్రీన్ ఉంటుంది. ఇది 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది గరిష్ఠంగా 1600 నిట్స్ బ్రైట్‌నెస్, 1 Milion:1 కాంట్రాస్ట్ రేషియో, రియల్ RGB పిక్సెల్ తో దీర్ఘకాలం గేమింగ్ లేదా మీడియా వినియోగానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. స్క్రీన్ చుట్టూ 4.9mm యూనిఫాం బెజెల్స్ ఉండటం వల్ల విజువల్ అనుభవం మరింత ఇమర్శివ్‌గా ఉంటుంది. ఈ స్క్రీన్ 5280Hz అల్ట్రా-హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ ను సపోర్ట్ చేస్తుంది. అలాగే SGS లొ బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ ఐ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్ పొందింది. దీని ద్వారా దీర్ఘకాల గేమింగ్ లేదా స్క్రీన్ ఉపయోగం కళ్లకు తక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది.
ఈ టాబ్లెట్‌లో Synaptics S3930 టచ్ చిప్ ఉపయోగించబడుతోంది. ఇది తక్కువ టచ్ డిలే, వేగవంతమైన రెస్పాన్స్, స్నైపింగ్‌కు అనుకూలమైన కంట్రోల్‌ను అందిస్తుంది. గేమింగ్ సమయంలో ప్లేయర్లకు మరింత మెరుగైన అనుభవం అందించేందుకు ఇది సహాయపడుతుంది. ఈ టాబ్లెట్ లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ వాడుతారు. ఇది హై ఎండ్ గేమింగ్, మల్టీటాస్కింగ్, మీడియా ప్రాసెసింగ్‌కి సరిపోయే విధంగా రూపొందించబడింది. వేడి నియంత్రణ కోసం యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ టాబ్లెట్ వెనుక భాగంలో, కెమెరా మాడ్యూల్ దిగువన ఏర్పాటు చేశారు.
Read Also: Kannappa : కన్నప్పలో రజినీకాంత్ ను తీసుకుందామనుకున్నా.. విష్ణు కామెంట్స్ వైరల్
రెడ్‌మ్యాజిక్ గేమింగ్ టాబ్లెట్ 3 ప్రో 8200mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక బ్యాటరీ కలిగిన కంపాక్ట్ గేమింగ్ టాబ్లెట్‌గా నిలుస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 22 నిమిషాల్లో 50% బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఈ టాబ్లెట్ Deuterium Front Transparent డిజైన్ లో వస్తుంది. డ్యుటీరియం ఫ్రంట్ ట్రాన్స్పరెంట్ డార్క్ నైట్, డ్యుటీరియం ఫ్రంట్ ట్రాన్స్పరెంట్ సిల్వర్ వింగ్ అనే రెండు రంగుల ఎంపికలతో అందుబాటులో ఉంటాయి. ఇక ఈ టాబ్లెట్ ధరను జూలై 11న అధికారికంగా వెల్లడించనున్నారు.