మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరో గా కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘విరూపాక్ష’. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ మూవీలో మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా ను కార్తీక్ వర్మ దండు ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ అద్భుతమైన స్క్రీన్ ప్లే అందించారు. ఎస్విసిసి బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా ను ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.అలాగే ఈ సినిమా కు కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ అద్భుతమై న సంగీతం అందించారు.బ్లాక్ మ్యాజిక్ నేపథ్యం లో విరూపాక్ష సినిమా తెరకెక్కింది
ఈ ఏడాది ఏప్రిల్ 21న థియేటర్లో ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన విరూపాక్ష సినిమా అదిరిపోయే వసూళ్ల ను రాబట్టి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.విరూపాక్ష సినిమా లాంగ్ థియేట్రికల్ రన్ లో ప్రపంచ వ్యాప్తం గా 100 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టింది. థియేటర్ లో అద్భుతంగా ఆడిన విరూపాక్ష సినిమా మే 21 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయింది. ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను కూడా ఎంతగానో మెప్పించింది..ఇదిలా ఉంటే విరూపాక్ష టీం మరో అద్భుతమైన మైథికల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.త్వరలోనే ఈ మైథికల్ థ్రిల్లర్ గురించి ఇతర విషయాలు అధికారికం గా వెల్లడించనుంది.త్వరలో రాబోయే ఈ మైథికల్ థ్రిల్లర్ విరూపాక్ష సినిమా ను మించి ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు అయినట్లు మూవీ టీం ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ తో మూవీ టీం మరోసారి ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేసింది.