PM Modi: కేంద్ర బడ్జెట్ 2025 ‘‘ప్రజల బడ్జెట్’’ అని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాని బడ్జెట్ ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ బడ్జెట్ పెట్టుబడుల్ని పెంచుతుందని, ఇది ‘‘వికసిత భారత్’’ లక్ష్యానికి మార్గం సుగమం చేస్తుందని అన్నారు.