Shobu Yarlagadda: బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు విషయంలో ఎంత నిక్కచ్చిగా మాట్లాడతాడో.. సోషల్ మీడియాలో కూడా తన అభిప్రాయాలను తెలపడానికి ఏ మాత్రం సంకోచించడు. ఇక ప్రస్తుతం ఆయన చేసిన ఒక ట్వీట్ నెట్టింట కలకలం సృష్టిస్తోంది. ఒక యువహీరో ఆటిట్యూడ్ చూపించి.. మంచి హిట్ సినిమాను వదులుకున్నాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక ఆ ట్వీట్ ను వెంటనే డిలీట్ చేయడంతో అసలు ఆ హీరో ఎవరు అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అసలు ఆ ట్వీట్ లో ఏమున్నది అంటే.. ” విజయాలు చాలా జాగ్రత్తగా నడుచుకుంటూనే వస్తాయి. ఇటీవలే మంచి హిట్ అందుకున్న ఒక కొత్త నటుడు.. ఒక డెబ్యూ డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కనీస గౌరవం చూపలేదు. ఈ వైఖరి అతని కెరీర్‌ను నిర్మించడంలో సహాయపడదని అతను ముందుగానే గ్రహించాడని నేను ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఆ హీరో ఎవరు అనేది ఆయన మెన్షన్ చేయలేదు.
Manchu Manoj: అందుకే చంద్రబాబుతో భేటీ అయ్యా.. పొలిటికల్ ఎంట్రీ.. ?
ఇక ఆ హీరో విశ్వక్ సేన్ అంటూ కొందరు కామెంట్స్ పెట్టుకొస్తున్నారు. బేబీ సినిమాను విశ్వక్.. స్క్రిప్ట్ కూడా వినకుండా రిజెక్ట్ చేసాడని డైరెక్టర్ సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు. దానికి సమాధానంగా.. స్క్రిప్ట్ విని.. తరువాత నో చెప్పడం కన్నా.. ముందే నో చెప్పాను అని విశ్వక్ తెలిపాడు. దీంతో వీరి గొడవపైనే శోభు స్పందించాడంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇది విశ్వక్ సేన్ గురించి కాదని శోభు క్లారిటీ ఇవ్వడంతో ఆ గొడవకు చెక్ పడింది. మరి శోభు చెప్పిన హీరో ఎవరు.. ? ఆ హిట్ సినిమా ఏంటి.. ? అని అభిమానులు ఆరా తీస్తున్నారు. నిజం చెప్పాలంటే ఒకకథను ఒక హీరో రిజెక్ట్ చేయడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇలా ఆటిట్యూడ్ తో రిజెక్ట్ చేయడం చాలా రేర్ అని పలువురు అంటున్నారు. మరి ఆ ఆటిట్యూడ్ స్టార్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.