ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే కార్పొరేట్ ఆస్పత్రికి పరుగులు పెడుతున్న రోజులివి. కానీ సర్కారీ ఆస్పత్రుల్లో అంతకుమించిన సౌకర్యాలు వున్నాయి. ఎంతోమంది మహిళా ఉన్నతాధికారులు ప్రభుత్వాసుపత్రిలోనే డెలివరీకి వెళుతున్నారు. తాజాగా ఓ జంట ప్రభుత్వాసుపత్రి వైద్యుల సహకారంతో తల్లిదండ్రులయ్యారు. అదికూడా ఎంతో ఖరీదుగా భావించే ఐవీఎఫ్ పద్దతి ద్వారా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. బిహార్ రాజధాని పట్నాలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ఆసుపత్రిలో ఈ అరుదైన సంఘటన జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే…