ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం కేంద్రంగా జరిగిన ఉగ్ర కుట్ర బయటపడింది. ఉగ్ర డాక్టర్ల బృందం ఉమర్, షాహీన్, ముజమ్మిల్ కలిసి దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నారు.
ఢిల్లీ కారు బ్లాస్ట్‌లో ఉగ్రవాది ఉమర్‌కు సహకరించిన.. క్రియాశీల సహ కుట్రదారుడు జాసిర్ బిలాల్ అలియాస్ డానిష్ ఫొటో వెలుగులోకి వచ్చింది. ఇతడే జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ల బ్రెయిన్ వాష్ చేశాడు. ఉగ్రవాదం వైపునకు మళ్లించాడు. ప్రస్తతం డానిష్‌కు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది.
ఢిల్లీ పేలుడుపై దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో తాజాగా అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. పేలుడుకు ముందు ఉగ్రవాది ఉమర్ ఎక్కడెక్కడ తిరిగాడో ఆ సీసీటీవీ ఫుటేజ్‌లను అధికారులు సేకరించారు. ఈ సీసీటీవీ ఫుటేజ్‌లో ఉమర్ రెండు సెల్‌ఫోన్లు ఉపయోగించినట్లుగా గుర్తించారు.
తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా ఢిల్లీ పేలుడు తర్వాత ఉగ్ర కుట్ర వెనుక ఉన్న మిస్టరీ అంతా బయటకొస్తోంది. ఇప్పటికే కీలక సమాచారాన్ని రాబట్టిన దర్యాప్తు సంస్థలు.. తవ్వేకొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరిన్ని విషయాలు బయటకొచ్చాయి.