Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Telangana Likely To See Congress Vs Bjp For Lok Sabha Polls As Brs Struggles

Telangana: హస్తం, కమలం పార్టీల మధ్యే పోటీ.. రాజకీయ పరిణామాలు ఏం చెబుతున్నాయి..?

Published Date :March 16, 2024 , 7:49 pm
By Venu Goapl Reddy
Telangana: హస్తం, కమలం పార్టీల మధ్యే పోటీ.. రాజకీయ పరిణామాలు ఏం చెబుతున్నాయి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Telangana: లోక్‌సభ షెడ్యూల్ విడుదలైంది. ఇక పోరు మిగిలింది. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదల కావడంతో ఇకపై తెలంగాణలో పోరు మరింత హీటెక్కనుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ పర్యటన తెలంగాణలో సుడిగాలి పర్యటన చేశారు. మార్చి 15న హైదరాబాద్ ప్రచారానికి అమిత్ షా రాబోతున్నారు. మెగా రోడ్ షో నిర్వహించనున్నారు. బీజేపీ తెలంగాణకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పకనే చెప్పారు. 2019 నుంచి 2023కి బీజేపీ తన ఓట్ల శాతాన్ని 14 శాతానికి పెంచుకుంది. ఈ సారి తెలంగాణ నుంచి మెజారిటీ సీట్లను దక్కించుకోవాలని చూస్తున్నారు. మొత్తం 17 ఎంపీ స్థానాల్లో రెండంకెల కన్నా ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.

Read Also: Petrol Price Reduce: మోడీ సర్కార్ గుడ్‌న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు రూ.15 తగ్గింపు.. ఎక్కడంటే?

మరోవైపు అధికార కాంగ్రెస్ కూడా తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో లోక్‌సభ స్థానాలను గెలవాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ మాత్రం వరస పరిణామాలతో కుదేలవుతోంది. తాజా రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండబోతుందా..? అనే అనుమానం కలుగుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలోని పలువురు నేతలు కాంగ్రెస్, బీజేపీల్లోకి చేరుతున్నారు. ఇలా కీలక నేతలు వేరే పార్టీలకు వెళ్లడం ఆ పార్టీని దెబ్బతీస్తోంది. తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ కీలక నేత, కేసీఆర్ కుమార్తె కవితని అరెస్ట్ చేయడం పార్టీని నైతికంగా దెబ్బతీసే అవకాశం ఉంది. మే 13న నాలుగో విడతలో భాగంగా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, సమయం చాలా ఉండటంతో రానున్న రోజుల్లో మరికొన్ని రోజుల్లో ఆ పార్టీ నుంచి మరిన్ని వలసలు ఉండే ప్రమాదం ఉంది.

ఇక బీజేపీ విషయానికి వస్తే 2019 ఎన్నికల దగ్గర నుంచి తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇక్కడ కష్టపడితే భవిష్యత్ బీజేపీదే అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈసారి 17 సీట్లలో 12కు పైగా సీట్లు సాధించాలని అమిత్ షా టార్గెట్ పెట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ 14 సీట్లలో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గతేడాది కాంగ్రెస్ విజయం సాధించడంతో ఈసారి ఆ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. బీజేపీ, అధికార కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించడం లేదు. బీజేపీ నేతలు కూడా తమ పోటీ కాంగ్రెస్‌తోనే ఉంటుందని చెబుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు బిబి పాటిల్‌ (జహీరాబాద్‌), పి రాములు (నాగర్‌కర్నూల్‌) కాషాయ పార్టీలో చేరారు. వలసలో పాటు సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి వంటివారు పోటీకి దూరంగా ఉండటం బీఆర్ఎస్‌కి దెబ్బగా మారింది. అయోధ్య రామమందిర నిర్మాణం, మోడీ ఫ్యాక్టర్ తమ విజయానికి దోహదం చేస్తాయని బీజేపీ భావిస్తోంది. ఇక కాంగ్రెస్ తమ సంక్షేమ పథకాలతో పాటు మైనారిటీ ఓట్లు తమ విజయానికి కీలకమవుతాయని చెబుతోంది. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ 09 స్థానాలు, బీజేపీ 04, కాంగ్రెస్ 03, ఎంఐఎం 01 స్థానాల్లో విజయం సాధించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BRS
  • congress
  • Lok Sabha elections-2024
  • telangana

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions