Mumbai Teacher: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో ఓ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చేతిరాత సరిగ్గా లేదనే కారణంతో ఓ టీచర్ ఎనిమిదేళ్ల బాలుడి పట్ల కృరంగా ప్రవర్తించింది. క్యాండిల్ వెలిగించి దానిపై బాలుడి కుడి చేయి పెట్టి అతడిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన మలాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే, ఈస్ట్ మలాద్‌లోని జేపీ డెక్స్ బిల్డింగులో రాజశ్రీ రాథోడ్ అనే యువతి ట్యూషన్లు చెప్తుంది.. అదే ప్రాంతానికి చెందిన మహమ్మద్ హమ్జా ఖాన్ (8) స్థానిక లక్షధామ్ స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హమ్జా ట్యూషన్‌కు వెళ్తాడు.
అయితే, సోమవారం నాడు రాత్రి సాధారణంగా ట్యూషన్‌కు వెళ్లిన మహమ్మద్ హమ్జా ఖాన్ పై, హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేదని రాజశ్రీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో క్యాండిల్ వెలిగించి దానిపై హమ్జా కుడిచేయి పెట్టించింది. నొప్పికి తాళలేక బాలుడు గుక్కతిప్పుకోకుండా ఏడవడం స్టార్ట్ చేశాడు. ఇక, రాత్రి 9 గంటల సమయంలో 8 ఏళ్ల బాలుడు హమ్జా ఖాన్ బాగా ఏడుస్తుండడంతో టీచర్ అతడి తండ్రి ముస్తకీన్ ఖాన్‌కు ఫోన్ చేసి వెంటనే వచ్చి తీసుకెళ్లాలని చెప్పింది. ముస్తకీన్ వచ్చి హమ్జాను ఇంటికి తీసుకెళ్లాగా.. ఇంట్లో తనకు జరిగిన విషయాన్ని చెబుతే తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు సదరు టీచర్ ను అదుపులోకి తీసుకుని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.