Supreme Court: విద్యార్థినికి బలవంతగా పువ్వులు తీసుకోవాలని టీచర్ కోరడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఒక పాఠశాల ఉపాధ్యాయుడు మైనర్ బాలికకు ఇతరుల ముందు పువ్వులు ఇచ్చి, వాటిని తీసుకోవాలని బలవంతం చేయడం లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ ఇచ్చే (పోక్సో)చట్టం కిందకు వస్తుందని చెప్పింది. అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడి ప్రతిష్టపై సంభావ్య ప్రభావాన్ని గుర్తిస్తూ, సాక్ష్యాధారాలను కఠినంగా పరిశీలించాల్సిన అవసరాన్ని కోర్టు నొక్కి చెబుతూ, అతనికి విధించిన…