తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షలు జరిమానా విధించేలా బిల్లు రూపొందించింది.. దీనికి సంబంధించిన బిల్లుకు గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదం తెలిపారు.
బిల్లుల క్లియరింగ్‌లో గవర్నర్ ఆర్‌ఎన్ రవి జాప్యంపై తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణను ప్రారంభించింది. హైకోర్టులకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు తెలిపింది.
సనాతన ధర్మంపై వ్యాఖ్యల విషయంలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వెనక్కి తగ్గడం లేదు. డీఎంకే నేత, తమిళనాడు క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతన ధర్మం నిర్మూలనపై మాట్లాడారు
గవర్నర్ ఆర్ఎన్ రవిని శాంతికి ముప్పు అని పేర్కొంటూ, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరుతూ తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించింది.
రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు తమిళనాడు గవర్నర్ R.N.రవిని భగవత్ ను ఆహ్వానించారు. ఈరోజు చెన్నైలోని గవర్నర్ నివాసానికి వెళ్లిన చిన్నజీయర్ స్వామి.. ఆహ్వాన పత్రికను అందించారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు 1,035 కుండ శ్రీ లక్ష్మీ నారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ట కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ జరగనుంది. ఫిబ్రవరి 14న పూర్ణాహుతిలో రాష్ట్రపతి పాల్గొనబోతన్నారు. ఇప్పటికే చిన్నజీయర్ స్వామి దేశవ్యాప్తంగా ఉన్న…