Taj Mahal: తాజ్‌మహల్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక విచారణ.. కేంద్రానికి నోటీసులు
- తాజ్‌మహల్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక విచారణ
- కేంద్రానికి, పురావస్తు శాఖకు నోటీసులు
- అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజ్‌మహల్ వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టు కీలక విచారణ జరిపింది. తాజ్‌మహల్‌ను హిందూ దేవాలయంగా ప్రకటించాలా? వద్దా అన్న అంశంపై విచారించింది. ఈ సందర్భంగా తాజ్‌మహల్‌పై సర్వే జరపాలా? అనేదానిపై కేంద్రానికి, భారత పురావస్తు శాఖకు నోటీసులు జారీ చేసింది. తాజ్‌మహల్‌పై శాస్త్రీయ సర్వే నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని న్యాయస్థానం ఆదేశించింది.
2015లో ఆగ్రా సివిల్ కోర్టులో దాఖలైన డిక్లరేటరీ సూట్. ‘లార్డ్ శ్రీ అగ్రేశ్వర్ మహాదేవ్ నాగ్నాథేశ్వర్ విరాజ్మాన్ తేజో మహాలయ మందిర్’ తరఫున పిటిషనర్లు తాజ్‌మహల్ సముదాయాన్ని హిందూ ఆలయంగా గుర్తించాలని కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్‌ను దిగువ కోర్టు కొట్టేసింది. ఈ అభ్యర్థనను ఆగ్రా ట్రయల్ కోర్టు తిరస్కరించింది. అనంతరం దాఖలైన రివిజన్ పిటిషన్‌ను కూడా అదనపు జిల్లా న్యాయమూర్తి నిర్వహణపరమైన కారణాలతో కొట్టివేశారు. దీంతో హైకోర్టును ఆశ్రయించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
దీంతో న్యాయమూర్తి రోహిత్ రంజన్ అగర్వాల్ ఈ కేసును విచారిస్తూ కేంద్ర ప్రభుత్వం, ఏఎస్ఐ తమ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. అలాగే ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న పంకజ్ కుమార్ వర్మకు కూడా నోటీసులు జారీ చేశారు. ఇక పిటిషనర్ల తరఫున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సీనియర్ న్యాయవాది హరి శంకర్ జైన్.. దిగువ కోర్టులు సర్వే అభ్యర్థనను తిరస్కరించడం సరైన నిర్ణయం కాదని వాదించారు. తాజ్‌మహల్ చారిత్రక స్వరూపాన్ని నిర్ధారించడానికి శాస్త్రీయ సర్వే, ఫొటోగ్రాఫిక్ డాక్యుమెంటేషన్ తప్పనిసరి అని కోర్టుకు తెలిపారు. కేసు విచారణ సందర్భంగా పిటిషనర్లు తాజ్‌మహల్ ప్రాంగణంలో అడ్వకేట్ కమిషనర్‌ను నియమించి సర్వే నిర్వహించడంతో పాటు ఫొటోగ్రాఫిక్, శాస్త్రీయ ఆధారాలను సేకరించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే తాజా విచారణలో అలహాబాద్ హైకోర్టు తాజ్‌మహల్ ఆలయమా? కాదా? అనే అంశంపై ఎలాంటి తుది తీర్పు ఇవ్వలేదు. ప్రస్తుతం సర్వే అభ్యర్థనపై కేంద్ర ప్రభుత్వం, ఏఎస్ఐ తమ అధికారిక వైఖరిని కోర్టుకు తెలియజేయాలని మాత్రమే ఆదేశించింది. దీంతో ఈ వివాదంలో న్యాయపరమైన ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..