Delhi: సీఎం అతిషి ఇంటి ముందు ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న నిరసన
- సీఎం అతిషి ఇంటి ముందు ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న నిరసన
- మురికి నీళ్ల బాటిల్‌తో ఆందోళన
- 15 రోజుల్లో పరిస్థితులు మారకపోతే తీవ్రంగా ఉంటుందని వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి అతిషి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మురికినీళ్లతో నిండిన బాటిల్‌ను తీసుకొచ్చి ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలకు ఇలాంటి నీళ్లేనా? సరఫరా చేసేదంటూ ఆమె నిలదీశారు. ఈ మేరకు ఆమె మురికినీళ్లకు సంబంధించిన వాటర్‌ను అతిషి ఇంటి ముందు పారబోసి.. బాటిల్ గేటు ముందు పెట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అతిషి వర్సెస్ స్వాతి అన్నట్టుగా మారింది. అయితే బీజేపీ స్వాతి వెనుకుండి కథ నడిపిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది.
ఇది కూడా చదవండి: Tirupati Crime: లాడ్జిలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. యువకుడు అరెస్ట్
Also Read
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
- SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
స్వాతి మాలివాల్ మీడియాతో మాట్లాడుతూ.. సాగర్‌పూర్, ద్వారక ప్రజలు తనకు ఫోన్ చేశారని.. దీంతో తాను అక్కడికి వెళ్లానని చెప్పారు. ఆ ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఓ ఇంటి దగ్గరకు వెళ్లి నల్లా విప్పి బాటిల్ పడితే ఇలాంటి నీళ్లు వచ్చాయని వివరించారు. నల్లాల్లో సరఫరా అవుతున్న నీరు నల్లగా, కలుషితంగా ఉందని చెప్పారు. అదే నీటిని ఇప్పుడు సీఎం అతిషి ఇంటికి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఇలాంటి నీటిని ఎవరైనా తాగుతారా?.. వాడుకుంటారా?. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదల కష్టాలు మాత్రం తీరడం లేదని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Winter: శీతాకాలంలో చిన్నారుల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలివే!
‘‘ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇదే నా హెచ్చరిక. రానున్న 15 రోజుల్లో ఢిల్లీలో ప్రతీ ఇంటికి మంచి నీరు అందాలి. లేని పక్షంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇవే నీటిని ట్యాంకర్‌లో నింపి సీఎం నివాసం దగ్గర పారబోస్తాం. ఇప్పుడు కేవలం ఒక్క బాటిల్ నీటిని మాత్రమే వేస్తున్నాను. ఇది కేవలం శాంపిల్ మాత్రమే.’’ అని స్వాతి మాలివాల్ వార్నింగ్ ఇచ్చారు.
अभी द्वारका विधानसभा के एक Retired Army officer के घर आई थी, महीनों से पूरे इलाक़े में गंदा बदबूदार पानी आ रहा है।
दिवाली पर CM @AtishiAAP ने इनके घर पर नल से सीधा Coca Cola सप्लाई करवाई है। हज़ारों परिवारों की दिवाली बर्बाद हो गई।
ये पानी की बोतल अभी दिवाली के गिफ्ट के रूप… pic.twitter.com/TJNEk4sb1l
— Swati Maliwal (@SwatiJaiHind) November 2, 2024
#WATCH | AAP MP Swati Maliwal arrives at Delhi CM Atishi's residence with a bottle filled with polluted water and throws it outside the CM's residence. She is claiming that this water is being supplied to the people of Delhi pic.twitter.com/ERJpqowuZX
— ANI (@ANI) November 2, 2024
#WATCH | Delhi | AAP Rajya Sabha MP Swati Maliwal says, "The people of Sagarpur, Dwarka had called me and the situation there is very bad… I went to a house and black water was being supplied there. I filled that black water in a bottle and I brought that water here, at the… https://t.co/FN3JgtYUXn pic.twitter.com/2twrYzVlO8
— ANI (@ANI) November 2, 2024
తాజావార్తలు
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!