Qatar-India: “మా సైనిక శిక్షణే కారణం”.. ఖతార్ ఉరిశిక్ష నుంచి బయటపడిన మాజీ నేవీ సిబ్బంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Qatar-India: ఖతార్ దేశంలో గూఢచర్యం ఆరోపణలతో ఉరిశిక్ష విధించబడిన 8 మంది భారత మాజీ నేవీ అధికారులు, శిక్ష నుంచి బయటపడ్డారు. ఇటీవల వారంతా భారతదేశానికి వచ్చారు. మోడీ ప్రభుత్వ హాయాంలో ఇది అతిపెద్ద దౌత్య విజయంగా భావించబడుతోంది. జలంతర్గామి నిర్మాణంలో ఇజ్రాయిల్ తరుపున గూఢచర్యానికి పాల్పడుతున్నారని చెబుతూ ఖతార్ కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. భారత ప్రభుత్వం కలుగజేసుకుని వారిని శిక్ష నుంచి తప్పించగలిగింది.
ఈ నేపథ్యంలో భారత్ తిరిగి వచ్చిన మాజీ నేవీ అధికారి తన అనుభవానలు చెప్పారు. రాగేష్ గోపకుమార్ అక్కడి జైళ్లలో కొన్ని నెలల పాటు శిక్ష అనుభవించారు. తాను తిరిగి సొంత ఊరు తిరువనంతపురం చేసుకోవడంతో భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబంతో తిరిగి కలుస్తున్నందుకు ఆనందం మరియు కృతజ్ఞతలు తెలిపారు. తాను, తన సహచరులు తమ సైనిక శిక్షణ కారణంగా మానసికంగా ధృడంగా ఉన్నామని, ఈ శిక్షణ మాకు ఉపయోగపడిందని, బతికిపోయామని చెప్పారు.
Also Read
- Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
గోపకుమార్ సోమవారం తిరువనంతపురానికి 16 కిలోమీటర్ల దూరం ఉన్న బలరామపురానికి చేరుకున్నారు. కుటుంబాన్ని చూడగానే ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. రోజూ ఐదారుసార్లు ఫోన్ చేసే భర్త, తన భార్యకు ఫోన్ చేయడం మానేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆరా తీసిన సమయంలో, తన కుటుంబం ఎంత దీనస్థితిలో ఉందో అర్థమయ్యేదని, తన కుటుంబ ప్రార్థనలు, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాల వల్లే తాము మళ్లీ స్వదేశానికి వచ్చామని అన్నారు. తమను విడిపించేందుకు చొరవ తీసుకున్న ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీజీ జోక్యం చేసుకుంటే తిరిగి స్వదేశానికి వస్తామని తెలుసని, అయితే ఎన్ని రోజులు పడుతుందో తెలియదని గోపకుమార్ అన్నారు.
Read Also: Ramam Raghavam: నా ప్రేమ మొదలయ్యింది నీతోనే డాడీ.. ధనరాజ్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యేలానే ఉన్నాడు
ఒక భారతీయ వ్యక్తి అమాయకుడై, విదేశాల్లో జైలు శిక్ష విధించబడితే, మన ప్రధాని ఆదుకుంటారని, ఈ విషయాన్ని ప్రతీ భారతీయులు తెలుసుకోవాలని ఆయన అన్నారు. 2017లో ఇండియన్ నుంచి రిటైర్ అయినట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత ఒమన్ డిఫెన్స్ ట్రైనింగ్ కంపెనీలో కమ్యూనికేషన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా చేరానని గోపకుమార్ తెలిపారు.
గతేడాది అక్టోబర్ 26న 8 మందికి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ శిక్షను డిసెంబర్ 28న మరణశిక్ష నుంచి మూడు నుంచి 25 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించింది. గతేడాది డిసెంబర్ నెలలో దుబాయ్‌లో జరిగిన COP28 సమ్మిట్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీతో సమావేశమై దీనిపై చర్చించారు.
తాజావార్తలు
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!