Qatar-India: ఖతార్ దేశంలో గూఢచర్యం ఆరోపణలతో ఉరిశిక్ష విధించబడిన 8 మంది భారత మాజీ నేవీ అధికారులు, శిక్ష నుంచి బయటపడ్డారు. ఇటీవల వారంతా భారతదేశానికి వచ్చారు. మోడీ ప్రభుత్వ హాయాంలో ఇది అతిపెద్ద దౌత్య విజయంగా భావించబడుతోంది. జలంతర్గామి నిర్మాణంలో ఇజ్రాయిల్ తరుపున గూఢచర్యానికి పాల్పడుతున్నారని చెబుతూ ఖతార్ కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. భారత ప్రభుత్వం కలుగజేసుకుని వారిని శిక్ష నుంచి తప్పించగలిగింది.
Qatar frees 8 Navy veterans: గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సిబ్బందిని ఖతార్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సోమవారం తెల్లవారుజామున ఓ ప్రకటన విడుదల చేసింది. వీరికి విధించిన మరణశిక్షను ఇప్పటికే న్యాయస్థానం జైలు శిక్షగా మార్చగా.. తాజాగా దాని నుంచి విముక్తి కల్పించి భారత్‌కు అప్పగించారు. అల్ దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది మాజీ భారతీయ…