Supreme Court: యోగీ సర్కార్ బుల్డోజర్ యాక్షన్ పై విచారణ.. స్టే ఇచ్చేందుకు నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత యూపీతో పాటు దేశ వ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్, ప్రయాగ్ రాజ్, హత్రాస్, సహరాన్ పూర్ ఏరియాల్లో రాళ్ల దాడులు, ఆస్తుల విధ్వంసం జరిగింది. దీంతో అక్కడి యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కన్నెర్ర చేసింది. ఇప్పటికే 300కు పైగా నిందితులను అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితులకు సంబంధించి వారి అక్రమ ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేస్తోంది ప్రభుత్వం.
తాజాగా ఈ అంశంపై సుప్రీం కోర్ట్ లో విచారణ జరుగుతోంది. యూపీలో నిందితుల ఇళ్లు కూలగొట్టకుండా యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా జమియత్- ఉలేమా- ఏ- హింద్ సంస్థ సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసింది. గురువారం ఈ పిటిషన్ ను కోర్ట్ విచారిస్తోంది. అక్రమ కూల్చివేతకు పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది సుప్రీం కోర్ట్ ను పిటిషన్ దారులు కోరారు. యూపీలో జావెద్ మహ్మద్ ఇంటితో సహా మరికొంత మంది ఇళ్లను కూల్చివేయడంపై ఈ పిటిషన్ దాఖలు చేశారు.
Also Read
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్‌గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్‌లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
- CM Vijay Tiruchi Speech: తన డ్రెస్సింగ్ స్టైల్‌పై ట్రోల్స్ చేసినోళ్లకు సీఎం విజయ్ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. !
జమియత్ ఉలేమా ఏ హింద్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ కు వ్యతిరేఖంగా రెస్పాండ్ కావాలని.. మూడు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని యూపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వచ్చే వారం విచారణ జరుపుతామని కేసును వాయిదా వేసింది.అయితే కూల్చివేతకు స్టే ఇవ్వలేమని.. అయితే కూల్చివేతలు చట్టప్రకారం జరగాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
యూపీ ప్రభుత్వం తరుపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. యూపీలో సరైన ప్రక్రియలోనే కూల్చివేతలు జరగుతున్నాయని ఆయన సుప్రీంకు తెలిపారు. ఢిల్లీ జహంగీర్ పురి ప్రాంతంలో ఏ వర్గానికి చెందని ఆస్తి ఉందో చూడకుండా నిర్మాణాలను తొలగించారని..ఇటువంటి కూల్చివేతలు సరైన ప్రక్రియలోనే సాగుతున్నాయని ఆయన కోర్టుకు విన్నవించారు. ఇదే సమయంలో పిటిషనర్ల తరుపున వాదిస్తున్న సీయూ సింగ్.. కూల్చివేతలకు ముందు 15-40 రోజుల డెడ్ లైన్ ఉండాలని, కూల్చివేతలకు ముందు నోటీసులు అందించాలని సుప్రీంను కోరారు. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూనే కూల్చివేతలు జరగుతున్నాయని ఆరోపించారు.
తాజావార్తలు
-
Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్‌గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
-
ICC Board Meeting: సంచలన నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. ఆ దేశ క్రికెట్ బోర్డు సభ్యత్వం రద్దు..
-
Anantha Sriram : పెద్ది సినిమాలో కధే పెద్ద హీరో !
-
IPL 2026: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర కలకలం.. ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్‌పై భారీ జరిమానా, నిషేధం..
-
Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!