ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం ఎంకే స్టాలిన్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఒక అమాయక యువకుడిని నిర్దాక్షిణ్యంగా చంపిన తర్వాత ఒకే ఒక్క పదం 'క్షమించండి' అని చెప్పడం కరెక్టేనా అని ప్రశ్నించారు.
తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం సంస్థ టాస్మాక్‌పై చేస్తున్న ఈడీ దాడులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. ఈడీ అన్ని హద్దులు దాటిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
MRK Panneerselvam: తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ పై డీఎంకే మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం విమర్శలు గుప్పించారు. గతంలో విజయ్ బ్లాక్ టిక్కెట్లు అమ్మిన వ్యక్తి ఇప్పుడు అవినీతి గురించి ప్రసంగాలు ఇస్తున్నాడు అని మండిపడ్డారు.
తమిళగ వెట్రి కళగం అధినేత దళపతి విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సర్కార్ పైనా విమర్శలు గుప్పించారు. కాగా, మణిపూర్‌లో జరుగుతున్న హింసను ఎత్తి చూపిస్తూ.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు.
అదానీ గ్రూప్ లంచాల వ్యవహారం భారతదేశాన్ని కుదిపేస్తోంది. అమెరికా చేసిన ఆరోపణలు ప్రస్తుతం పొలిటికల్‌గా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక గురువారమైతే మార్కెట్ షేర్లు అన్నీ భారీగా పడిపోయాయి.
Chennai Air Show: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో గల మెరీనా బీచ్ లో నిర్వహించిన ఎయిర్ షోలో విషాద ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాట జరగడంతో ఐదుగురు మరణించాగా.. డిహైడ్రేషన్ కారణంగా 260 మంది స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చేరారు.
నీట్ పరీక్షను రద్దు చేయాలని టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ కేంద్రాన్ని కోరారు. విద్యార్థులకు ఉపకార వేతనాల ప్రదానోత్సవం రెండో దశ కార్యక్రమంలో తమిళనాడు వెట్రి కజగం అధ్యక్షుడు, నటుడు విజయ్ నీట్ పరీక్షకు వ్యతిరేకంగా మాట్లాడారు. నీట్ పరీక్ష రద్దుకోసం తమిళనాడు స్టాలిన్ సర్కారు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మద్దతు ఇస్తున్నానని ఆయన ప్రకటించారు.
Tamil Nadu : తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య 63కి చేరింది. జూన్ 18న రాష్ట్రంలోని కరుణాపురం గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటన తర్వాత కల్తీ మద్యం తాగి 225 మంది వివిధ ఆసుపత్రుల్లో చేరారు.
ఏటీఎంకు కొత్త నిర్వచణం చెబుతూ ఎనీ టైం మందు అంటూ ఓ సినిమాలో ఓ యాక్టర్ డైలాగ్ చెప్పిన విషయం గుర్తుందా? అది ఇప్పుడు నిజమైపోయింది.. అందేంటి? అదేలా ? అంటారా? అదేనండి బాబు.. ఇప్పుడు ఎనీ టైం మందు (ఏటీఎం)లు కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.. ఏటీఎంలో కార్డు పెట్టి కావాల్సిన మొత్తాన్ని కొడితే క్యాష్ వచ్చినట్టుగానే.. ఏ లిక్కర్ కావాలో.. దానికి సరపడి డబ్బులు వేస్తే.. ఆ ఏటీఎం నుంచి మీకు నచ్చిన మందు వస్తుందన్నమాట..…