తమిళ స్టార్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం ‘ఏస్’. దర్శక, నిర్మాత అరుముగ కుమార్ ఈ మూవీని 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. విజయ్‌కి జోడిగా రుక్మిణి వసంత్ నటించనుంది. మే 23న రిలీజ్ చేయబోతున్న ఈ సినిమాను, శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద, బి. శివ ప్రసాద్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ సందడి చేసింది. ఈ ఈవెంట్‌లో.. భాగంగా
Also Read : Tamil Heros : టాలీవుడ్ డైరెక్టర్స్‌కి రెడ్ కార్పెట్ వేస్తున్న.. కోలీవుడ్ హీరోస్ !
విజయ్ సేతుపతి మాట్లాడుతూ .. ‘అరుముగ కుమార్ నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. నాకు సినిమాలో మొదటి ఛాన్స్ ఇచ్చింది కూడా ఆయనే. మళ్లీ ఇప్పుడు ఆయనతో పని చేస్తుండడం ఆనందంగా ఉంది. ఇందులో యాక్షన్, రొమాన్స్ అన్ని అంశాలు ఉంటాయి. ఈ చిత్రంలో పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. బి. శివ ప్రసాద్ మల్టీ టాలెంటెడ్. ఆయనకు ఆల్ ది బెస్ట్. మే 23న మా సినిమా అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
Also Read : Srinivasan : నేను నెపో కిడ్‌ని మాత్రం అసలు కాను..
అలాగే శ్రీ పద్మిణి సినిమాస్ అధినేత దర్శక, నిర్మాత బి. శివ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘ ‘ఏస్’ సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లు కనిపిస్తోంది. అందరి మొహాల్లో సంతోషం ఉంది. ఈ కథ, క్యారెక్టర్స్ అన్నీ అద్భుతంగా ఉండబోతున్నాయి. విజయ్ సేతుపతి గారు మళ్లీ అందరినీ ఆకట్టుకోబోతున్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి. అన్నీ సెట్ అయితే ‘రొమాంటిక్ డాన్’ అనే సినిమాను ఆయనతో త్వరలోనే ప్రకటిస్తాను. ‘ఏస్’ సినిమాగానూ అందరికీ ముందుగా కంగ్రాట్స్’ అని తెలిపారు. దివ్యా పిళ్లై మాట్లాడుతూ .. ‘ ‘ఏస్’ చిత్రంలో నటించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. విజయ్ సేతుపతి గారితో నటించడం సంతోషంగా ఉంది. మా సినిమా అందరూ చూడాలి’ అని అన్నారు.