Supreme Court: ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఎలక్షన్ కమిషనర్ల నియామకాన్ని తాత్కాలికంగా నిలిపేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధుల నియామకంపై స్టే విధించేందుకు అంగీకరించలేదు. దీనిపై వచ్చే వారం కోర్టు విచారణ చేపట్టనుంది. మాజీ ఐఏఎస్ అధికారులైన ఇద్దరిని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిన్న ఎంపిక చేసింది. ఫిబ్రవరి 14న అనూప్ చంద్ర పాండే పదవి విరమణ చేయడం, మార్చి 8న అరుణ్ గోయెల్ ఎలక్షన్ కమిషన్లుగా రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీలను వీరితో భర్తీ చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కి కొత్త కమిషనర్లు సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సాయపడనున్నారు.
Read Also: Supreme Court: ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ..
Also Read
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్‌లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్‌తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
జ్ఞానేష్ కుమార్ ఫిబ్రవరిలో సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేయగా, సుఖ్‌బీర్ సింగ్ సంధు ఉత్తరాఖండ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ రోజు ఎలక్షన్ కమిషనర్లుగా వీరిద్దరు బాధ్యతలు చేపట్టారు. మరోవైపు రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈసీ ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనుంది. ఎంపీ ఎన్నికలతో పాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. 2019లో మార్చి 10 లోక్‌సభ ఎన్నికలను ప్రకటించి, ఏప్రిల్ 11 నుంచి ఏడు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించి, మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టారు.
తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్‌కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్‌తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!