Students Self Distraction: మూడు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు.. ఎల్‌పీయూలో విద్యార్థుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Students Self Distraction-Huge protest at Lovely Professional University:ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అలహాబాద్ యూనివర్సిటీలో తారాచంద్ హస్టల్ లో ఓ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫీజు పెంపు నిర్ణయం వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య విషయం యూనిర్సిటీ మొత్తం వ్యాపించడంతో విద్యార్థులంతా నిరసన, ఆందోళనలు చేపట్టారు. విద్యార్థులు ఫీజు పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మరణించిన విద్యార్థి జయ కపూర్ యూనివర్సిటీకి చెందిన వాడు కాదని.. హాస్టల్ లో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నారని.. ఫీజు పెంపుతో ఈ ఆత్మహత్యకు సంబంధం లేదని వర్సిటీ వర్గాలు తెలిపాయి.
Read Also: Hunger Deaths: ప్రపంచంలో ప్రతీ నాలుగు సెకన్లకు ఒక ఆకలి చావు.
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడులో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని మంగళవారం బలవన్మరణానికి పాల్పడింది. తూతుకూడి జిల్లా ససువందనైలోని స్కూల్ లోని వాష్‌రూమ్‌లో ఉరి వేసుకుని కనిపించింది. తమిళనాడు రామనాథపురానికి చెందిన 17 ఏళ్ల వైథీశ్వర అనే బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవిల్ పట్టి ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాల వల్లే బాలిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు.
పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయింది. జలంధర్ లోని ఎల్పీయూలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు విద్యార్థి సూసైడ్ నోట్ లో వెల్లడించారు. ఈ ఆత్మహత్య యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. భారీగా విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే విద్యార్థులు మాత్రం పెద్ద సంఖ్యలో ఆందోళనలకు దిగారు. వ్యక్తిగత కారణాల వల్లే విద్యార్థి చనిపోయాడని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. చంఢీగడ్ యూనివర్సిటీలో విద్యార్థినుల ఎంఎంఎస్ లకు సంబంధించిన ఆందోళనలు జరుగుతున్న రోజు వ్యవధిలోనే ఎల్పీయూలో విద్యార్థి ఆత్మహత్యపై ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి.
తాజావార్తలు
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!