కొన్ని వింత ఆచారాలు వింటుంటే.. నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు. అసలు ఇలాంటివి ఆచారాలా..? అని అనుమానము కూడా వస్తుంటుంది. భార్యను వేరొకడు చూస్తూనే అనుమానంతో రగిలే భర్తలు ఉన్న ఈ లోకంలో భార్యలను కావాలనే వేరొకరితో పంపిస్తారట.. దానికి డబ్బు కూడా తీసుకుంటారంటా.. ఈ వింత ఆచారం మధ్యప్రదేశ్ లో ఇప్పటికి కొనసాగుతుండడం విశేషం.. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో కనివిని ఎరుగని వింత ఆచారం బయటపడింది. ఇక్కడ తమ భార్యలను భర్తలు అద్దెకు ఇస్తారు. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు.. సంవత్సరాలు కూడా అద్దెకు భార్యలను తీసుకెళ్లొచ్చు.
ఈ సంప్రదాయం పేరు ధడిచా.. దీని ప్రకారం పెళ్లి కానీ ధనవంతులు.. వేరొకరి భార్యను తీసుకెళ్లి భార్యగా ఉంచుకోవచ్చు. ఎన్నిరోజులు కావాలంటే అన్నిరోజులు వారిని భార్యగా మార్చుకోవచ్చు. వారి భర్తలకు రూ.10 లేదా రూ.100ల స్టాంపులపై సంతకాలు పెట్టి, రేటు మాట్లాడుకొని అద్దెకి తీసుకెళ్లవచ్చు. కొంచెం విడ్డూరంగా ఉన్నా అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం ఇది. ఒక్కో మహిళ రేటు పదివేలు నుంచి లక్ష వరకు ఉంటుంది. ఆమె కూడా అచ్చం సొంత భార్యలానే ప్రవర్తించాలి. మానసికంగా, శారీరకంగా ఆమె అతడి భార్యే.. ఆ సమయంలో ఆమెకు పిల్లలు పుట్టినా కూడా అది వారి బాధ్యతే.. వయస్సు తక్కువ ఉన్న వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందట. పెళ్లి కాని వారిని అద్దెకు తీసుకున్న సందర్భాల్లో ఎక్కువ మొత్తంలో ముట్టచెబుతుంటారట. ఈ ఆచారాన్ని పోలీసులు మాన్పించాలని ప్రయత్నించినా ప్రతిసారి విఫలమవుతుందంట.. ఇదెక్కడి వింత ఆచారంరా బాబు..