Asaduddin Owaisi: అసదుద్దీన్ ఇంటిపై దాడి.. ఇది నాల్గవసారి అంటూ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి జరిగింది. ఢిల్లీలోని ఒవైసీ ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నిన్న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. రాజస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన.. ఢిల్లీలోని తన ఇంటిపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఒవైసీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దాడిలో తన ఇంటి కిటికీలు పగిలిపోయాయని ఒవైసీ పోలీసులకు తెలిపారు. దుండగుల రాళ్ల దాడిలో ఇంటి చుట్టూ రాళ్లు పడి ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడి..ఇది తొలిసారి కాదు. నాలుగోసారి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఢిల్లీలోని ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై దుండగులు మూడుసార్లు దాడి చేశారు. ఇలాంటి దాడులు 2014 నుంచి ఇప్పటివరకు తన ఇంటిపై నాలుగు సార్లు దాడి జరిగిందని ఒవైసీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఒవైసీ పోలీసులను కోరారు. అయితే.. సమాచారం అందుకున్న ఢిల్లీ అదనపు డీసీపీ నేతృత్వంలోని పోలీసుల బృందం ఆయన నివాసానికి వెళ్లి వేగంగా దర్యాప్తు చేశారు. అయితే అక్కడే సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Read also: Mlc Kaushik Reddy: కౌశిక్ రెడ్డికి నోటీసులు.. ఈనెల 21న విచారణకు హాజరుకావాలి లేదంటే..
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అందుకే అసదుద్దీన్ ఒవైసీ రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంతలోనే ఢిల్లీలోని తన నివాసంపై రాళ్లదాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. ఇలా నాల్గవ సారి జరగడంతో ఎంఐఎం అధినేత సీరియస్ అయ్యారు. తన ఇంటిని కొందరు టార్గెట్ చేసి మాటి మాటికి ఇలా దాడులు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొక సారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని పోలీసులను కోరారు. ఇటువంటి ఘాతుకానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Stalled Wedding: కొన్ని నిమిషాల్లో పెళ్లి.. నో చెప్పిన వరుడు.. అసలేం జరిగింది?
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!