Stalled Wedding: అనవరం అనుకున్న వాటి కోసం కక్కుర్తి పడితే కొన్నిసార్లు చివరకు అసలుకే ఎసరు వస్తుంటుంది. చేసే పనిని వదిలిపెట్టి కొందరు అనవసరమైన పనుల కారణంగా చివరకు కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. వధుకు పెళ్లి నచ్చకపోవడం లేదా వరుడు పెళ్లి నచ్చకపోవడం ఇలాంటి కారణాతో పెళ్లి ఆగిపోతూఉంటుంది. దీని ప్రభావం కుటుంబ సభ్యులపై పడుతూ ఉంటుంది. ఇలాంటి ఘటనే హైదరాబాద్ పాతబస్తీ చంద్రయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Read also: Online Betting Crime: విషాదం.. యువకుడ్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్
చంద్రయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వారికి మేనఫాతిమాకు చంద్రయాణాగుట్ట బండ్లగూడ ప్రాంతంలో ఉంటున్న వరుడు జక్రియతో పెళ్లి నిశ్చయించారు. ఇది ప్రేమ వివాహం కూడా కాదు. పెద్దలు కుదిర్చిన పెళ్లి. అంతా హడావుడిగా బయలు దేరి పెళ్లికి రెడీ అయ్యారు. పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఒకరినొకరు ఏకమయ్యే వేళ. పెళ్లి మండపం నిశ్శబ్ద వాతావరణం. అసలు ఏం జరిగిందో తెలియని ఆయోమయంలో కొందరు వుంటే మరికొందరు షాక్ లో వున్నారు. కారుణం వరుడు పెళ్లికి నో చెప్పడం. అసలు ఏం జరిగిందో తెలియదు పెళ్లిని వరుడు ఎందుకు కాదన్నాడో ఎవరికి అర్థం కాలేదు. పెళ్లికి ముందే అందరిని అడిగి అమ్మాయిని చూసి అందరూ ఒప్పుకున్నాకే పెళ్లికి అన్నీ సిద్ధమయ్యారు. అయితే.. ఏమైందో ఏమో గానీ వరుడు పెళ్లికి నిరాకరించడంతో పెళ్లి మండపం మూగబోయింది. దీంతో వధువు తల్లి దండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు.
Read also: Somavathi Amavasya Bhakthi Tv Live: సోమవతి అమావాస్య నాడు ఈ పూజచేస్తే..
ఎందుకు వద్దన్నారంటూ నిలదీసిన వరుడు తల్లిదండ్రులు సమాధానం చెప్పలేదు. వధువు షాక్ లో ఉండిపోయింది. కాసేపట్లో పెళ్లి మండపంలో వుండి ఆనందంగా గడపాల్సిన వధువు తీవ్ర విషాదంలో వెళ్లిపోయింది. వధువు తల్లి దండ్రులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. వరుడు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. అయితే వరుడు పెళ్లి ఎందుకు నిరాకరించాడు విషయం ఇంకా తెలియాల్సి ఉంది. పెళ్లి నిశ్చయం అయినప్పటి నుంచి ఇదే మాట వరుడు ఎందుకు అనలేదు? వరుడు వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడా? ఇది తెలిసిన కుటుంబ సభ్యులు వరుడికి బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించారా? అనే కోణంలోనే కాకుండా.. వధువుకు ఈ పెళ్లి ఇష్టం లేక వరుడితో చెప్పడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా? అనే మరో కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.
Tamilisai Soundararajan: నడుస్తూ నడుస్తూ ..కిందపడ్డ గవర్నర్ తమిళిసై