Passenger Train: విశాఖపట్నం జిల్లాలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది.. అయితే, డ్రైవర్ అప్రమత్తతో భారీ ప్రమాదం తప్పింది.. ఇవాళ ఉదయం అనంతగిరి మండలం కాశీపట్నం దగ్గర విశాఖ – విశాఖ – కిరండోల్ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో పట్టాలపై నుంచి పక్కకు ఒరిగిపోయింది ఓ బోగీ.. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు, కుటుంబసభ్యులు, రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.. అయితే, ఘటనా స్థలంలో రైళ్ల పునరుద్దరణకు ఏర్పాట్లు ప్రారంభంఅయ్యాయి.. అయితే, కొండ ప్రాంతాల్లో అతి శీతల ఉష్ణోగ్రతల సమయాల్లో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు రైల్వే అధికారులు.. ఓవైపు పండుగ, మరోవైపు.. ఈ సీజన్‌లో విశాఖ, అరకులోయకు ప్రయాణికుల రద్దీ ఉంటుంది.. అలాంటి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆందోళనకు గురయ్యారు. కానీ, ఎలాంటి నష్టం జరగకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు..
Read Also: Police Station: పీఎస్‌లో అనుమానాస్పద మృతి.. సీఐ సహా నలుగురు పోలీసులపై వేటు