Parliament ‘assault’ case: రాహుల్ గాంధీ పార్లమెంట్ ‘‘దాడి’’ కేసుపై స్పెషల్ టీం ఏర్పాటు..!
- రాహుల్ గాంధీ పార్లమెంట్ ‘‘దాడి’’ కేసు..
- విచారణ కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసిన ఢిల్లీ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament ‘assault’ case: పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. రాహుల్ గాంధీ తమ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్‌పుత్‌లను నెట్టివేయడంతో వారు గాయపడినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చేర్పించారు. సభలోకి వచ్చే ప్రయత్నంలో రాహుల్ గాంధీ తమను నెట్టారని బీజేపీ చెబుతోంది.
Read Also: Ujjain: ప్రాణం తీసిన ‘‘దుపట్టా’’.. మిషన్‌లో ఇరుక్కుని మహిళ మృతి..
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
ఈ ఘటనపై పోలీసులకు బీజేపీ ఎంపీలు గురువారం ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీపై కేసు దర్యాప్తును చాణక్యపురిలోని ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఇంటర్‌స్టేట్ సెల్ (ISC) విభాగం నిర్వహిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఆందోళన చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ పోలీసులు దీనిపై భౌతికదాడి, రెచ్చగొట్టడం వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
అంతకుముందు శుక్రవారం, ఈ కేసును పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ నుంచి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కి బదిలీ చేశారు. శుక్రవారం రాత్రి క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసింది. ఈ టీంలో ఇద్దరు ఏఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ముగ్గురు ఎస్ఐలు ఉన్నారు. ఈ టీం నేరుగా డీసీపీకి రిపోర్ట్ చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని అందచేయాలని పార్లమెంట్ అడ్మినిస్ట్రేషన్‌ని పోలీసులు ఆశ్రయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, దర్యాప్తు పత్రాలు క్రైమ్ బ్రాంచ్‌కి అందాల్సి ఉంది.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..