CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
- తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
- సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి జరగని పోలింగ్
- మద్రాస్ హైకోర్టు విధించిన మధ్యంతర ఆంక్షలే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే పెరంబూర్ స్థానాన్ని నిలుపుకుని.. తిరుచిరాపల్లి తూర్పు స్థానాన్ని వదులుకున్నారు. అయితే తాజాగా రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. మధురాంతకం, ధరాపురం స్థానాల్లో ఎన్నికలు జరగడం విజయం సాధించడం కూడా జరిగిపోయింది. కానీ విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి మాత్రం బైపోల్ జరగలేదు. దీంతో ఈ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తమిళనాడులోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ స్థానాలకు సంబంధించిన గత ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో.. న్యాయపరమైన వివాదం పరిష్కారమయ్యే వరకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ కారణంతోనే తిరుచ్చి బైపోల్ నిలిచిపోయింది.
Also Read
- Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా 'అర్నబ్' తుఫాను శాటిలైట్ ఫొటోలు..
- Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
- Train Passengers Alert: రైలు ప్రయాణికులకు అలర్ట్.. 6 గంటల పాటు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు బంద్!
- Karnataka MLC Election Results: కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీజేపీ పంచ్.. క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ-జేడీఎస్ కూటమి.!
2026 ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ రెండు నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు. అయితే ఒక వ్యక్తి రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికైనా.. రెండు స్థానాల్లోనూ కొనసాగడానికి వీలులేని నిబంధనల కారణంగా ఆయన ఒక సీటును వదులుకోవాల్సి వచ్చింది. దీంతో పెరంబూర్ స్థానాన్ని నిలుపుకొని, తిరుచిరాపల్లి ఈస్ట్‌కు రాజీనామా చేశారు. మే నెలలో ఆయన రాజీనామా ఆమోదం పొందడంతో ఆ స్థానం ఖాళీ అయింది.
సాధారణంగా ఒక అసెంబ్లీ స్థానం ఖాళీ అయితే.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఉప ఎన్నిక నిర్వహించేందుకు చర్యలు చేపడుతుంది. అయితే తిరుచిరాపల్లి ఈస్ట్‌లో విజయ్ ఎన్నికను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలవడంతో పరిస్థితి మారిపోయింది. తిరునెల్వేలికి చెందిన కె. వెంకటాచలపతి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) ఈ వివాదానికి కారణమైంది. ఎన్నికల పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న సమయంలో ఉప ఎన్నికలను ప్రకటించకుండా భారత ఎన్నికల సంఘాన్ని (ECI) ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. తిరుచిరాపల్లి ఈస్ట్‌తో పాటు కరూర్, విరాలిమలై, పెరుందురై, అంబాసముద్రం నియోజకవర్గాల్లోనూ గత ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలైలో మద్రాస్ హైకోర్టు ఈ ఐదు స్థానాలకు ఉప ఎన్నికలను ప్రకటించకుండా ఎన్నికల సంఘాన్ని నిలువరించింది. ఆ మధ్యంతర ఆంక్షలు కొనసాగడంతో అక్టోబర్ 6న జరిగిన ఉప ఎన్నికల జాబితాలో ఈ స్థానాలకు చోటు దక్కలేదు.
అసలు వివాదం ఏమిటి?
తిరుచిరాపల్లి ఈస్ట్‌లో విజయ్‌పై పోటీ చేసిన డీఎంకే అభ్యర్థి ఇనిగో ఎస్. ఇరుదయరాజ్ ఎన్నికల ఫలితాన్ని సవాలు చేసిన వారిలో ఉన్నారు. అసలు ఎన్నికల ఫలితంపై కోర్టు విచారణ పూర్తికాకముందే ఉప ఎన్నిక నిర్వహిస్తే.. తర్వాత కోర్టు తీర్పు వల్ల మరో అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించే పరిస్థితి ఏర్పడవచ్చని న్యాయపరమైన ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అసలు ఎన్నిక ఫలితాన్ని కోర్టు రద్దు చేసినా లేదా ప్రత్యర్థి అభ్యర్థిని విజేతగా ప్రకటించినా.. అప్పటికే నిర్వహించిన ఉప ఎన్నిక ఫలితంపై కొత్త వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ కారణంతోనే పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు పరిష్కారమయ్యే వరకు ఐదు స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయబోమని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది.
ఇక ఉప ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడంపై విజయ్ నేతృత్వంలోని TVK అసంతృప్తి వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 29న మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి.. ఐదు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ప్రకటించకుండా విధించిన మధ్యంతర ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది. ప్రభావిత నియోజకవర్గాల్లో పోటీ చేయని, ఓటు వేయని వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ కారణంగా ఉప ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడం సమంజసం కాదని వాదించింది. విజయ్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది జి. మసిలామణి.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లోని న్యాయసూత్రాలను ప్రస్తుత పరిస్థితులకు యథాతథంగా వర్తింపజేయవచ్చా అనే అంశాన్ని ప్రశ్నించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 234 నియోజకవర్గాల్లో 4,023 మంది అభ్యర్థులు పోటీ చేశారని ప్రస్తావిస్తూ.. బహుళ అభ్యర్థులు బరిలో ఉన్న ఎన్నికల ప్రత్యేక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన వాదించినట్లు సమాచారం. ఐదు నియోజకవర్గాలకూ ఒకేసారి ఆంక్షలు విధించడం సమంజసమేనా అనే అంశాన్ని కోర్టు మరోసారి పరిశీలించాలని కోరింది. దీనిపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది. కోర్టు నిర్ణయాన్ని బట్టి ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ ఒరిజినల్ కాన్సెప్ట్ బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజ్!
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కోనసీమలో 6 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. జనజీవనం అస్తవ్యస్తం!
-
Vespa Vibe 125, Vibe 150: Vespa Vibe 125, Vibe 150 లాంచ్.. కొత్త కలర్స్, 5-ఇంచెస్ TFT డిస్ప్లే, ABS ఫీచర్లు!
-
Abhishek-Vaibhav: నా ఇన్నింగ్స్ క్రెడిట్ వైభవ్‌కే.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!