Jaipur: ఇంట్లో చేసిన నూడుల్స్ తిని ఏడేళ్ల చిన్నారి మృతి.. అక్క పరిస్థితి విషమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లోని జైపూర్ (Jaipur) నగరంలో జరిగిన ఒక విషాదకర ఘటన ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. ఇంట్లోనే సరదాగా చేసుకుని తిన్న నూడుల్స్ (Noodles) ఏకంగా ఏడేళ్ల చిన్నారి ప్రాణాలను బలితీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా, ఆమె అక్క పరిస్థితి కూడా విషమంగా మారింది.
జైపూర్‌లోని ఝోత్వర (Jhotwara) ప్రాంతం మంగళం సిటీలో నివసించే పీహూ కుమావత్ (7), ఆమె అక్క దివ్యాంశి గురువారం ఉదయం ఇంట్లోనే స్వయంగా నూడుల్స్ తయారు చేసుకుని తిన్నారు. ఆ తర్వాత ఇద్దరూ నిద్రపోయారు. మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన వారి తల్లి, నిద్రపోతున్న పిల్లలను లేపేందుకు ప్రయత్నించింది. పెద్దమ్మాయి దివ్యాంశి నిద్రలేచింది కానీ, చిన్నారి పీహూలో ఎలాంటి కదలిక లేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఏడేళ్ల పీహూ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మరోవైపు దివ్యాంశి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. చికిత్స అనంతరం శుక్రవారం ఉదయం దివ్యాంశి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది.
Also Read
- Nasha Mukt Bharat: డ్రగ్స్‌పై పోరుకు విక్టరీ వెంకటేష్ మద్దతు.. హైదరాబాద్‌లో నషా ముక్త్ భారత్ యాత్ర..
- CM Chandrababu: కూటమి ఓటు బ్యాంకు పెరిగింది.. వైసీపీకి తగ్గింది.. ఈవీఎం, బ్యాలెట్ ఏదైనా కూటమిదే విజయం.
- Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
- Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కర్ధాని పోలీస్ స్టేషన్ (Kardhani Police Station) సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది ఫుడ్ పాయిజనింగ్ వల్లే జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించడంతో పాటు, పిల్లలు తిన్న నూడుల్స్ శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు (Lab) పంపించారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అసలే కష్టాల్లో ఉన్న ఈ కుటుంబంపై ఈ ఘటన మరింత పిడుగులా పడింది. మృతి చెందిన పీహూ సోదరుడు గోవింద్ గత రెండు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు ఉన్నట్టుండి కుమార్తె కూడా దూరమవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
తాజావార్తలు
-
Jaipur: ఇంట్లో చేసిన నూడుల్స్ తిని ఏడేళ్ల చిన్నారి మృతి.. అక్క పరిస్థితి విషమం..
-
KL Rahul: గ్లెన్ ఫిలిప్స్‌కు డ్రింక్స్ కొనిస్తా.. రివ్యూపై రాహుల్ ఫన్నీ కామెంట్స్!
-
Nasha Mukt Bharat: డ్రగ్స్‌పై పోరుకు విక్టరీ వెంకటేష్ మద్దతు.. హైదరాబాద్‌లో నషా ముక్త్ భారత్ యాత్ర..
-
CM Chandrababu: కూటమి ఓటు బ్యాంకు పెరిగింది.. వైసీపీకి తగ్గింది.. ఈవీఎం, బ్యాలెట్ ఏదైనా కూటమిదే విజయం.
-
Parliament Session December 2026: డిసెంబర్ 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!?.. కీలక బిల్లుపై ఉత్కంఠ
ట్రెండింగ్
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!