Salman Khan-Shraddha Kapoor: శ్రద్ధా కపూర్‌కు సారీ చెప్పిన సల్మాన్.. ఇంతకీ ఏం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan Apologises to Shraddha Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ విడుదలకు సిద్దమైంది. ఎన్నో వాయిదాల అనంతరం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే డిసెంబర్ 4నే బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించిన ‘ఈథా’ కూడా విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాల మధ్య పోటీ నెలకొననుంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రద్ధా సినిమాతో తన చిత్రం అనుకోకుండా క్లాష్ అవుతోందని, ఈ విషయం ముందే తెలిసి ఉంటే ఆ తేదీని ఎంచుకునేవాడిని కాదని వెల్లడించారు.
ఇటీవల ఏబీపీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ తన సినిమా విడుదల తేదీ ఖరారు చేయడంలో ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడారు. ‘తొలుత నవంబర్ 20న సినిమాను విడుదల చేయాలని భావించాము. అయితే వీఎఫ్ఎక్స్ పనుల్లో కొన్ని లోపాలు గుర్తించడంతో వాయిదా పడింది. ఆ తర్వాత నవంబర్ 27న విడుదల చేయాలనుకున్నాము. కానీ అదే రోజు సూరజ్ బర్జాత్యా సినిమా ‘యే ప్రేమ్ మోల్ లియా’ విడుదలవుతుండటంతో వెనక్కి తగ్గాము. సూరజ్‌తో నేను ఎప్పటికీ బాక్సాఫీస్ పోటీకి దిగను. అలాగే సన్నీ డియోల్ సినిమా విడుదల ఉండటంతో.. ఆయనతోనూ పోటీ పడకూడదని నిర్ణయించుకున్నా. డిసెంబర్ 24న షారుఖ్ ఖాన్, సుహానాల కింగ్ విడుదల కానుంది. షారుఖ్‌తో ఎప్పటికీ పోటీకి దిగను. అంతర్జాతీయ చిత్రాలైన అవెంజర్స్: డూమ్స్‌డే, డ్యూన్ వంటి సినిమాలతో పోటీ ఉన్నా నాకు ఇబ్బంది లేదు కానీ.. షారుఖ్ ఖాన్‌తో మాత్రం బాక్సాఫీస్ క్లాష్ ఉండకూడదు’ అని సల్మాన్ చెప్పారు.
Also Read
- Varanasi OTT Deal: ‘వారణాసి’ ఓటీటీ డీల్.. ఊహించని ధర!
- January 12 Vidudala నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది.. డ్యాన్స్‌తో అదరగొట్టిన కీర్తి, కృతి!
- Nasha Mukt Bharat: డ్రగ్స్‌పై పోరుకు విక్టరీ వెంకటేష్ మద్దతు.. హైదరాబాద్‌లో నషా ముక్త్ భారత్ యాత్ర..
- Sara Tendulkar Wedding: శుభ్‌మన్ గిల్ కాదు.. యువ హీరోతో సారా టెండూల్కర్ పెళ్లి?
శ్రద్ధా కపూర్ నటించిన ‘ఈథా’ కూడా డిసెంబర్ 4నే విడుదల కానుండటంపై సల్మాన్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. ‘ఈ విషయం నాకు ముందుగా తెలియదు. తెలిసి ఉంటే శ్రద్ధా సినిమాతో పోటీకి వచ్చేవాడిని కాదు. ఇప్పటికే శ్రద్ధాకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాను. శ్రద్ధా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఆమెకు ఫోన్ చేసి.. ఈ విషయం నాకు తెలియదు, నిజంగా క్షమించు అని అన్నాను. అందుకు ఆమె రెండు సినిమాలూ విడుదల కావడానికి తగినంత స్థలం ఉంది సర్ అని చెప్పింది. అది విని నేను చాలా సంతోషించాను. అందరూ శ్రద్ధా సినిమాను కూడా థియేటర్లలో చూడాలి’ అని సల్మాన్ కోరారు. ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి చిత్రాంగద సింగ్ కూడా శ్రద్ధాపై ప్రశంసలు కురిపించారు. శ్రద్ధా అద్భుతమైన నటి అని, ఇప్పటికే తన నటనతో ఎన్నోసార్లు నిరూపించుకుందని అన్నారు. మాతృభూమి, ఈథా రెండూ మంచి సినిమాలేనని.. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి రెండు చిత్రాలనూ ఆదరించాలని ఆమె కోరారు.
తాజావార్తలు
-
Salman Khan-Shraddha Kapoor: శ్రద్ధా కపూర్‌కు సారీ చెప్పిన సల్మాన్.. ఇంతకీ ఏం జరిగింది?
-
Varanasi OTT Deal: ‘వారణాసి’ ఓటీటీ డీల్.. ఊహించని ధర!
-
CM Chandrababu: కూటమి ధర్మం పాటించాం.. సీట్లు రాలేదని అలగడం ఏంటి..? బీజేపీపై చంద్రబాబు అసహనం..
-
Antibiotics Misuse: జ్వరం, దగ్గు, జలుబుకు యాంటీబయోటిక్స్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
Rahul Gandhi vs Kiren Rijiju: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్.. 1962 యుద్ధం, పేదరికంపై కాంగ్రెస్‌కు 4 ప్రశ్నలు!
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!