Bengaluru Stampede: 18 సంవత్సరాల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును సన్మానం చేసేందుకు బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన తొక్కిసలాటలో సుమారు 11 మంది మృతి చెందగా, మరో 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన ఒక్కసారిగా కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ పార్టీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది.
Read Also: Kubera : ‘కుబేర’ రన్ టైం రిస్క్?
ఇక, తాజాగా, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఆర్‌సీబీ ఆటగాళ్లను సత్కరించడానికి రాజ్‌భవన్‌కు ఆహ్వానించాలని సిద్ధరామయ్య సర్కార్ ప్లాన్ చేసింది.. విధాన సౌధలోనే సన్మాన కార్యక్రమం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.. అయితే, విధాన సౌధలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా గవర్నర్‌ను ముఖ్యమంత్రి అధికారికంగా ఆహ్వానించారని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గతంలో చేసిన ప్రకటనలో.. ఈ సత్కారం ప్రభుత్వ కార్యక్రమం కాదు.. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం గవర్నర్‌ను ఆహ్వానించిందని తేల్చి చెప్పారు.. కానీ, రాజ్ భవన్ వర్గాలు ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం సీఎం వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా ఉంది.