దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. అంత తర్వగా మరిచిపోయే కేసే కాదు. యావత్తు దేశాన్నే కలవరపాటుకు గురి చేసిన కేసు ఇది.
ఇండోర్ వాసి రాజా రఘువంశీ హత్య కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి సోనమ్ భర్తను చంపేసినట్లుగా పోలీసులు తేల్చారు. తాజాగా రాజా రఘువంశీ అంత్యక్రియల్లో సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.