ఎంఐఎం బీజేపీకి బి టీం అన్నారు ఆప్ సౌత్ ఇన్ ఛార్జి సోమ్ నాథ్ భారతీ. ముస్లిం ఓట్లు చీల్చుతూ బీజేపీకి ఓవైసీ లాభం చేస్తున్నాడు. మా నెక్స్ట్ టార్గెట్ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్. కాశ్మీర్ పండిట్ల కోసం బీజేపీ ఏం చేసింది. కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతకు డబ్బులు మాత్రమే కావాలి. యూట్యూబ్ లో పెడితే అందరూ ఫ్రీ గా చూస్తారు.
కేసీఆర్ అవినీతి తెలంగాణలో చిన్నపిల్లలను అడిగిన చెప్తారు. పంజాబ్ లో కాంగ్రెస్ దళిత సీఎం చేసిన కాంగ్రెస్ కు ప్రజలు షాక్ ఇచ్చారు. దళితుడిని సీఎం చేసినంత మాత్రాన ఆ వ్యక్తి దళితులకు మేలు చేస్తారని లేదు. కుల, మత రాజకీయాలకు అతీతంగా పంజాబ్ ప్రజలు తీర్పును ఇచ్చారు. పంజాబ్ లో కేజ్రీవాల్ పేరు తుపాన్‌లా పనిచేసింది.
ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కేజ్రీవాల్ అమలు చేశారు. ఢిల్లీ పోలీసు మా చేతుల్లో లేకపోయినా ప్రపంచంలోనే ఎక్కడలేనట్లు ఢిల్లీలో సీసీటీవీలు ఏర్పాటు చేసాం. కేజ్రీవాల్ ను ఉగ్రవాది అంటూ ప్రచారం చేశారు. కుల మత రాజకీయాలు చేసేందుకు తెలంగాణలో కూడా కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి.మేము కుల మత రాజకీయాలు చేసేందుకు ఇక్కడికి రాలేదు.కేజ్రీవాల్ మోడల్ గవర్నెన్స్ నినాదంతో ఎన్నికలకు వెళ్తాము.అవినీతిరహిత పాలన అందించడమే మా లక్ష్యం. తెలంగాణలోని ప్రతి గడపకు వెళ్తాము. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదు. 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. 12 లక్షల ఉద్యోగాలు కల్పించాం. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ప్రధాని మోడీ ఏం చెయ్యలేదు. ఢిల్లీలో మునిసిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలంటేనే బీజేపీ భయపడుతుందంటేనే కేజ్రీవాల్ అంటే ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు అన్నారు సోమ్ నాథ్ భారతీ. మూడు మునిసిపాలిటీలను అకారణంగా విలీనం చేస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోడీ ఖూనిచేస్తున్నారు. మోడీ కాకపోతే కేజ్రీవాల్ అనే స్థితికి వచ్చాము. ఏప్రిల్ 14 న పాదయాత్ర చేపడతాం. కేజ్రీవాల్ మోడల్ గవర్నెన్స్ ను ప్రజల ముందుకు తీసుకెళ్తాము.మోడీ ని ఓడించాలనే లక్ష్యంతో కూటమి ఏర్పడితే అది విజయం సాదించదు.సమస్యలపై కూటమి ఏర్పడితేనే కూటమి విజయం సాధిస్తుంది.అలాంటి కూటమి వస్తే అప్పుడు కూటమిలో చేరడంపై ఆలోచిస్తాం.ఢిల్లీలో ఆప్ మనుగడ ఏం లేనప్పుడే అద్భుతాలు చేసింది.
ధర్మం, జాతి ఆధారంగానే కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి తప్ప అభివృద్ధిపై చేయడం లేదు.మేము అభివృద్ధిపేరుతో సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తూ రాజకీయాలు చేస్తున్నాం.పనిచేయడం ఎలాగో కేజ్రీవాల్ ను చూసి నేర్చుకోవాలి.ఎన్నికల కమిషన్ ను కూడా బీజేపీ ప్రభావితం చేస్తుంది.స్వతంత్ర వ్యవస్థన్నింటిని బీజేపీ కబ్జా చేసింది.అనేక సంక్షేమ కార్యక్రమాలుఢిల్లీలో విజయవంతంగా అమలు చేసాం.విద్య, వైద్యం వంటి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాము.20వేల లీటర్ల మంచినీళ్లు, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తున్నాం అన్నారు.
70 శాతం మంది 200 యూనిట్ల కంటే తక్కువే విద్యుత్ వాడుతారు, వారందరికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. మహిళలకు ఉచిత బస్ రవాణా, రక్షణ కోసం సీసీటీవీలు, ఫ్రీ కోచింగ్ ఇలా ఎన్నో చేసాం. మతాలకు అతీతంగా తీర్థయాత్రల స్కీమ్ అమలు చేస్తున్నాం. నిన్నటి ఢిల్లీ బడ్జెట్ లో టాక్స్ లను పెంచలేదు, అవినీతిని తగ్గించి ఆదాయాన్ని పెంచాం. విద్యావ్యవస్థ బలోపేతం పైనే ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నాం. ఉచిత హామీలు అమలు చేస్తున్న లాభాల్లో ఉన్న రాష్ట్రం ఢిల్లీ మాత్రమే అంటూ కాగ్ రిపోర్ట్ చెప్తుంది. ఢిల్లీలో 10 లక్షల మంది తెలంగాణకి చెందిన ప్రజలున్నారు.