PM Modi: రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ విదేశీ టూర్‌లకు టికెట్లు బుక్ చేసుకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో శుక్రవారం పాల్గొన్న ఆయన రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత నేతల ఫారిన్ టూర్ల టికెట్లు బుక్ అయ్యాయని తనకు ఎవరో సమాచారం అందించాలని అన్నారు. ఇద్దరి పేర్లను నేరుగా తీసుకోకుండా.. ‘‘ కాంగ్రెస్, ఎస్పీ పార్టీల కలలు చెదిరిపోయాయి. జూన్ 4 తర్వాత ఓటమికి ఎవరిని నిందించాలనే ప్లాన్ వేస్తున్నారు. వారి విదేశీ పర్యటన టిక్కెట్లు కూడా బుక్ అయ్యాయని ఎవరో నాకు సమాచారం ఇచ్చారు’’ అని ప్రధాని అన్నారు.
Also Read
ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఉనికి లేదు, కాంగ్రెస్ మొత్తం కుటుంబ గౌరవాన్ని కాపాడటంలో నిమగ్నమైందని ఆయన ఆరోపించారు. ప్రతీ ఎన్నికల్లో భావసారూప్యత ఉన్న కాంగ్రెస్, ఎస్పీలు భాగస్వామ్యంలో పోటీ చేయతాయని, ఈ రెండు కూడా కుటుంబం, అవినీతి కోసం రాజకీయాల్లో ఉన్నాయని, రెండు పార్టీలు ఓటు బ్యాంకును సంతోషపెట్టడానిక ఏదైనా చేయగలరని, ఇరు పార్టీలు నేరస్తులు, మాఫియాను ప్రోత్సహిస్తాయని, కాంగ్రెస్-ఎస్పీలు రెండూ కూడా ఉగ్రవాదుల పట్ట సానుభూతితో ఉంటాయని ఆయన అన్నారు.
గ్యాంగ్‌స్టర్, ఇటీవల మరణించిన ముఖ్తార్ అన్సారీ ఇంటికి వెళ్లి అఖిలేష్ యాదవ్ వారి కుటుంబాన్ని పరామర్శించడంపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాఫియాపై సమాజ్‌వాదీ పార్టీ ప్రేమ ముగియలేదు, వారి పార్టీ అధినేత మాఫియా సమాధిపై ‘ఫాతియా’ చదువుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో పాకిస్తాన్ భారత్‌పై దాడి చేసేదని, కాంగ్రెస్ వారికి క్లీన్‌చిట్ ఇచ్చయేది, వారు ‘కాషాయ ఉగ్రవాదం’ అంటూ తప్పుడు కథనాలు అల్లేవారని ఆరోపించారు. యూపీలో గతంలో ఎస్పీ సర్కార్ అల్లర్లకు ఆతిథ్యం ఇస్తుంటే, గ్యాంగ్‌స్టర్ సీఎంని కలిసేందుకు హెలికాప్టర్లతో పర్యటించేవారని ప్రధాని అన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు