Varanasi : సూపర్ స్టార్ బర్త్‌డే స్పెషల్.. వారణాసి ‘రుద్ర’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి‘. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బజ్డేట్ పై తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్‌ను జెట్ స్పీడ్ చేసేస్తున్నాడు రాజమౌళి.
కాగా నేడు సూపర్ స్టార్ మహేశ్ బర్త్ డే సందర్భంగా ఈసినిమాలో మహేశ్ పోషిస్తున్న రుద్ర పాత్రకు సంబంధించి పోస్టర్స్ రిలీజ్ చేసారు రాజమౌళి. ఈ ఫోటోలు ఆఫ్రికా షెడ్యూల్‌కు సంబంధించినవి. ‘రౌద్రం ఒక్కటే అతడి స్వభావం కాదు’ అనే క్యాప్షన్ తో ఎక్స్ లో పోస్ట్ చేసారు రాజమౌళి. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో ‘రుద్ర’గా రౌద్రం చూపించిన మహేశ్ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్ లో లాంగ్ హెయిర్, గడ్డం మీసాలతో పూర్తి మాస్, రగ్గడ్ లుక్ ఉబర్ కూల్ గా దర్శమిస్తున్నాడు సూపర్ స్టార్. అయితే మహేశ్ బాబు ఈ సినిమాలో రుద్ర, శ్రీరాముడిగా మహేశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నేడు పుట్టిన రోజు సందర్భాంగా శ్రీరాముడు లుక్ చేస్తారని ఆశించారు ఫ్యాన్స్. కానీ అవేమి లేకుండా సింపుల్ పోస్టర్స్ తో సరిపెట్టేసాడు రాజమౌళి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్ ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శక ధీరుడు.
Also Read
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!