Bihar: జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగికి షాక్.. పార్టీ నుంచి బహిష్కరణ
- బీహార్ రాజకీయాల్లో తీవ్ర కలకలం
- జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగికి షాక్
- పార్టీ నుంచి కేసీ త్యాగి బహిష్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. అధికార జేడీయూలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పార్టీ సీనియర్ నాయకుడు కేసీ త్యాగిని అధిష్టానం బహిష్కరించింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. కొన్ని విభేదాలు కారణంగా జేడీయూ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. అయినా కూడా రాజకీయాల్లో చురుగ్గానే ఉంటున్నారు. అనూహ్యంగా శనివారం ఆయన్ను పార్టీ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది. ఆయనతో పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని జేడీయూ పేర్కొంది.
ఇటీవల నితీష్‌కుమార్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి కేసీ త్యాగి లేఖ రాశారు. చౌదరి చరణ్ సింగ్, కర్పూరి ఠాకూర్‌లకు ఇచ్చినట్లుగానే నితీష్ కుమార్ కూడా భారతరత్నకు అర్హులని ప్రధాని మోడీకి అధికారికంగా లేఖ రాశారు. అయితే ఈ డిమాండ్‌ను జేడీయూ తోసిపుచ్చింది. ఆయన లేఖతో పార్టకి ఎలాంటి సంబంధం లేదని జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ పేర్కొన్నారు.
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
ఇది కూడా చదవండి: Trump: జేడీ వాన్స్, మార్కో రూబియో పిల్లలకు ట్రంప్ బహుమతులు.. ఏమిచ్చారంటే..!
గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కూటమి భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దాదాపు 202 స్థానాలు గెలిచి తిరిగి విజయాన్ని అందుకుంది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే జేడీయూలో కీలక నేతగా ఉన్న కేసీ త్యాగి మాత్రం ప్రభుత్వ విధానాలను తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది.
ఇది కూడా చదవండి: Trump-Iran: 217 మంది నిరసనకారుల మృతి.. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?