Indore: పెళ్లైన కొన్ని గంటలకే విడాకులు.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే..!
- పెళ్లైన కొన్ని గంటలకే విడాకులు
- గంటల వ్యవధిలోనే కోర్టు విడాకులు
- పరస్పర అంగీకారంతో విడిపోయిన జంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లంటే నూరేళ్ల పంట అని.. ఏడు జన్మల బంధం అని పెద్దలు అంటుంటారు. ఇది వైవాహిక బంధానికి సంబంధించిన నానుడి. పెళ్లంటే జీవితాంతం కలిసుండే బంధం అని.. భాగస్వామ్యలిద్దరూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ కలిసుండమే పెళ్లి అని చెబుతుంటారు. అలాంటి బంధం నేటి కాలంలో మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. పెళ్లైన కొన్ని గంటలకే ఓ జంట విడాకులు తీసుకుంది. న్యాయస్థానం కూడా వారి అభ్యర్థనను మన్నించి విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది.
ఇండోర్‌లో ఇటీవల ఓ జంటకు పెళ్లైంది. పెళ్లయ్యాక నూతన వధువు.. తాను వేరొకరిని ప్రేమించానని.. అతనితోనే జీవిస్తానని భర్తకు అసలు విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు ఒత్తిడి భరించలేక ఈ పెళ్లి చేసుకున్నట్లు కుండబద్ధలు కొట్టినట్లుగా విషయాన్ని భర్తకు తెలిపింది. దీంతో భర్త సానుకూలంగా స్పందించాడు. దంపతుల పరస్పర అంగీకారంతో కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పెళ్లైన మూడు, నాలుగు రోజుల్లోనే ఫ్యామిలీ కోర్టును కోరారు.
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
భార్యాభర్తలు కలిసి జీవించడానికి ఇష్టపడటం లేదని న్యాయవాది వర్షా గుప్తా న్యాయస్థానానికి తెలిపారు. విచారణ సందర్భంగా హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13-బి ప్రకారం ఒక సంవత్సరం పాటు విడిగా జీవించాలనే షరతు కోర్టు లేవనెత్తింది. ఈ షరతు నెరవేరకుండా విడాకుల పిటిషన్ అసలు చెల్లుబాటు కాదని గుర్తుచేసింది. దీనికి న్యాయవాది బదులిస్తూ… హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 14(2) కింద దరఖాస్తు ఉనికిలో లేని వివాహంలో భార్యాభర్తలను కలిసి జీవించమని బలవంతం చేయరాదని సుప్రీం కోర్టు తన ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొందని గుర్తుచేశారు. వారి సమయం, జీవితాలు ప్రభావితం కాకుండా చూసుకోవడానికి వారిని వేరుగా ఉంచడమే సముచితమని ధర్మాసనం దృష్టికి న్యాయవాది తీసుకెళ్లారు. దీంతో విచారణ సందర్భంగా దంపతులు విడిపోవడానికి అంగీకరించగా.. కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో 168 గంటల్లోనే అనగా ఏడు రోజుల్లో నూతన దంపతులకు విడాకులు మంజూరు అయ్యాయి.
తాజావార్తలు
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!