1000 Cr Movie : 2026 సెకండాఫ్‌లో రూ. 1000 కోట్ల సినిమా ఏది? రేసులో నాలుగు సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినిమా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్క్ అనేది ఇప్పుడు ప్రతిష్టాత్మక మైలురాయిగా మారింది. 2026 ప్రథమార్థంలో వచ్చిన ‘ధురంధర్ 2’ చిత్రం రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో 2026 ద్వితీయార్థంలో విడుదల కాబోయే చిత్రాల్లో ఏవి రూ. 1000 కోట్ల రేసులో నిలుస్తాయనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఓ నాలుగు భారీ బడ్జెట్ చిత్రాలు ఈ రూ. 1000 కోట్ల బెంచ్‌మార్క్‌ను తాకే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Toxic : ‘కేజీఎఫ్ 2’ చిత్రంతో ఏకంగా రూ. 1200 కోట్ల వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ సూపర్ స్టార్ యశ్, ఈసారి ‘టాక్సిక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆగస్టు 26న పాన్ వరల్డ్ స్థాయిలో విడుదలవుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవర్ ఫుల్ యాక్షన్, గ్లోబల్ అపీల్‌తో రూ. 1000 కోట్ల మార్క్‌ను ఈ చిత్రం సునాయాసంగా దాటుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
Fouzi : ఇప్పటికే ‘బాహుబలి 2’, ‘కల్కి 2898 AD’ చిత్రాలతో రెండుసార్లు రూ. 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన ఏకైక సౌత్ హీరోగా రెబల్ స్టార్ ప్రభాస్ రికార్డు సృష్టించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రభాస్ క్రేజ్ చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ కథతో మరోసారి రూ. 1000 కోట్ల కలెక్షన్లను సాధించడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషిస్తున్నారు.
Jailer 2 : ఇంతకుముందు ‘2.O’ చిత్రంతో రూ. 723 కోట్ల వసూళ్లను సాధించి అగ్రస్థానంలో నిలిచిన సూపర్ స్టార్ రజనీకాంత్, ఇప్పటివరకు రూ. 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టలేకపోయారు. అయితే, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌తో తెరకెక్కుతున్న హిట్ ఫ్రాంచైజీ మూవీ ‘జైలర్ 2’తో ఆ వెయ్యి కోట్ల కల నెరవేరుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. సీక్వెల్ పై ఉన్న అంచనాల దృష్ట్యా ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించే అవకాశం ఉంది.
Ramayana : భారతీయ ఇతిహాసం ఆధారంగా అత్యంత బ్రహ్మాండమైన బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొంది. రణ్‌బీర్ కపూర్, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్-ఇండియన్ ఎపిక్ చిత్రం రూ. 1000 కోట్లే లక్ష్యంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతోంది. మరి ఈ నాలుగు భారీ చిత్రాలలో ఏది బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల మైలురాయిని చేరుకుంటుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?