Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Hacks: కిచెన్ ప్లాట్‌ఫారమ్‌లు, సింక్ ఏరియాలు లేదా తీపి పదార్థాల డబ్బాల చుట్టూ చీమలదండు చేరడం సాధారణ సమస్య. ఒక్కోసారి ఇవి ఆహార పదార్థాల్లోకి దూరి వాటిని పాడు చేయడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ముప్పుగా మారుతుంటాయి. అయితే వీటిని వదిలించుకోవడానికి మార్కెట్లో దొరికే కెమికల్ చాక్‌లు, స్ప్రేలను వాడటం వల్ల ఆహార పదార్థాలు విషపూరితమయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కెమికల్స్ లేకుండా, రూపాయి ఖర్చు కాకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోగలిగే ఒక అద్భుతమైన స్ప్రే ఉంది. దానిని సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నాచురల్ స్ప్రేకు కావలసిన పదార్థాలు
ఒక ఖాళీ స్ప్రే బాటిల్
Also Read
- Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
డెటాల్ (Dettol) – 2 చెంచాలు
ఇంగువ పొడి (Asafoetida) – 1 చెంచా
తయారీ విధానం..
ముందుగా ఒక ఖాళీ స్ప్రే బాటిల్ తీసుకుని, అందులో రెండు చెంచాల డెటాల్ లిక్విడ్‌ను పోయాలి. ఆ తర్వాత అందులో ఒక చెంచా మెత్తని ఇంగువ పొడిని కలపాలి (ఒకవేళ ఇంట్లో పల్కల ఇంగువ ఉంటే దాన్ని దంచి పొడిగా చేసుకోవచ్చు). ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్లు పోసి బాటిల్‌ను బాగా షేక్ (కలపాలి) చేయాలి. ఇంగువ – డెటాల్ నుంచి వచ్చే ఘాటైన వాసన చీమలకు అస్సలు పడదు. కిచెన్, సింక్ కింద, తీపి డబ్బాల చుట్టూ లేదా ఇంట్లో చీమలు తిరిగే ప్రదేశాల్లో ఈ మిశ్రమాన్ని స్ప్రే చేస్తే చాలు.. చీమలకు ఎలాంటి హాని కలగకుండానే అవి ఆ ప్రాంతం నుంచి శాశ్వతంగా పారిపోతాయి. కెమికల్స్ వాడకుండా ఇల్లాళ్లకు వంటింటిని హైజీన్‌గా ఉంచుకోవడానికి ఇదొక బెస్ట్ కిచెన్ హ్యాక్‌గా పని చేస్తుందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!