Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
- దేశాన్ని విభజించొద్దు, మనమంతా భారతీయులం..
- రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కిరణ్ రిజిజు కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiren Rijiju: ఉత్తర-దక్షిణ భారతదేశం మధ్య విభజన ప్రేరేపిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. దేశాన్ని ఇలా విభజించొద్దని హితవు పలికారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా మనమంతా భారతీయులమే అని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి తన పన్నుల్ని వినియోగిస్తున్నారని, దక్షిణాది ప్రజల్ని ‘‘ద్వితీయ శ్రేణి పౌరులు’’గా చూస్తున్నారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనికి కౌంటర్‌గా రిజిజు ఘాటు సమాధానం ఇచ్చారు. ఇదే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను విస్మరించి, ఉత్తరాదికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ సీఎం ఆరోపించారు.
‘‘ప్రధాని ఉత్తర భారతదేశానికి చెందినవారు. రాష్ట్రపతి కూడా ఉత్తర భారతదేశానికి చెందినవారే. దీనికి కారణం మాకు ప్రాతినిధ్యం వహించే శక్తి మీకు (బీజేపీకి) లేకపోవడమే’’ అని రేవంత్ రెడ్డి బెంగళూర్‌లో జరిగిన ఒక మీడియా సమావేశంలో ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
Also Read
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
- Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
ఈ వ్యాఖ్యలకు రిజిజు కౌంటర్ ఇస్తూ.. ‘‘రాష్ట్రపతి తూర్పు భారతదేశంలోని ఒడిశాకు చెందిన వినయశీలి, అంకితభావం గల గిరిజన వ్యక్తి. ప్రధానమంత్రి పశ్చిమ భారతదేశంలోని గుజరాత్లో జన్మించిన మంచి నాయకుడు. ఉపరాష్ట్రపతి దక్షిణ భారతదేశంలోని తమిళనాడుకు చెందిన ఒక సామాన్య వ్యక్తి’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
-
Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
-
Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!