తెలుగులో పలు చిత్రాలలో నాయికగా నటించిన నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ నుండి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎంపికయ్యారు. అమరావతి ఎస్.సి. రిజర్వ్డ్ పార్లమెంట్ సీటు. నవనీత్ కౌర్ తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో ఆ సీటు నుండి పోటీ చేసి గెలిచారంటూ, ఆ నియోజవర్గం నుండి ఓడిపోయిన శివసేన అభ్యర్థి, మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆనంద రావ్ అడ్సుల్ ముంబై హైకోర్ట్ లో ఆ మధ్య పిటీషన్ వేశారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు. నవనీత్ కౌర్ కుల ధృవీకరణ పత్రం తప్పు అని, ఆమె మోచి కులానికి చెందిన వ్యక్తి కాదనే ఆధారాలు ఉన్నాయని ముంబై హైకోర్ట్ భావించి, ఆమె కాస్ట్ సర్టిఫికెట్ ను రద్దు చేసింది. దానితో పాటు రెండు లక్షల రూపాయల జరిమానా విధించింది. దీనిపై అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ సుప్రీమ్ కోర్టు తలుపుతట్టింది.
Read Also : “కూ”లోకి అడుగు పెట్టిన అనుష్క
అక్కడ నవనీత్ కౌర్ కు కొంత ఊరట లభించింది. ముంబై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీమ్ కోర్ట్ స్టే ఇచ్చింది. నవనీత్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి… మోచి, చమార్ రెండు సమానార్థాలు కలిగిన పదాలే అని ఆమె ఎస్.సి. కి చెందిన వ్యక్తే నని, అయితే ముంబై హైకోర్ట్ తాము దాఖలు చేసిన పత్రాలను పరిశీలించకుండా తీర్పు ఇచ్చిందని వాదించారు. దీన్ని కపిల్ సిబాల్ ఖండించించారు. అయితే సుప్రీమ్ కోర్ట్ కౌంటర్ అఫిడవిట్ వేయామని సిబాల్ ను కోరింది. మొత్తం మీద వెకేషన్ బెంచ్ లోని న్యాయమూర్తులు జస్టీస్ వినీత్ శరన్, దినేష్ మహేశ్వరి ఇచ్చిన స్టే ఆర్డర్ నవనీత్ కౌర్ కు కాస్తంత ఓదార్పును కలిగించిందనే భావించాలి.