Sanjay Malhotra: నేడు ఆర్బీఐ నూతన గవర్నర్‌గా మల్హోత్రా బాధ్యతలు స్వీకరణ
- నేడు ఆర్బీఐ నూతన గవర్నర్‌గా మల్హోత్రా బాధ్యతలు స్వీకరణ..
- నేటి నుంచి మూడేళ్ల పాటు పదవిలో ఉండనున్న సంజయ్ మల్హోత్రా..
- రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మల్హోత్రా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Malhotra: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్‌గా ఈరోజు (డిసెంబర్ 11) సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళవారం నాడు శక్తికాంత దాస్ పదవీ కాలం ముగిసింది. ఈ సందర్భంగా దాస్ అందరికీ వీడ్కోలు చెబుతూ వెళ్లిపోయారు. ఇక, ఆర్బీఐ తదుపరి గవర్నర్‌గా సోమవారం సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. మల్హోత్రా.. రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి.
Read Also: Mohan Babu: మీడియా ప్రతినిధులపై బౌన్సర్ల దాడి.. పోలీసు శాఖ సీరియస్..
Also Read
కాగా, సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్‌గా మూడేళ్ల పాటు పదవిలో ఉండనున్నారు. నేటి నుంచి మూడు సంవత్సరాల పాటు ఆయన బాధ్యతలు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో ప్రకటించింది. ఇక, మల్హోత్రా..కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, యూఎస్‌లోని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా అందుకున్నారు. 33 ఏళ్ల కెరీర్‌లో పవర్, ఫైనాన్స్, టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గనులు మొదలైన అనేక రంగాల్లో పని చేసిన అనుభవం ఆయన ఉంది. అయితే, రెవెన్యూ కార్యదర్శిగా పని చేయక ముందు ఆర్థిక సేవల శాఖ కార్యదర్శిగా కూడా మల్హోత్రా విధులు నిర్వహించారు. రాష్ట్రంతో పాటు సెంట్రల్ సర్కార్ లో ఆర్థిక, పన్నుల విషయంలో అనుభవం ఉంది. అలాగే, ప్రత్యక్ష, పరోక్ష సుంకాల కోసం పన్ను విధాన రూపకల్పనలో సంజయ్ మల్హోత్రా కీలక పాత్ర పోషించారు.
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!