Congress: వరస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ పార్టీ, గత వైభవాన్ని తిరిగి సాధించేందుకు పార్టీ సంస్థాగత ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. కింది స్థాయి నుంచి పార్టీ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ ‘‘సంఘటన్ సుజన్ అభియాన్’’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముందుగా, గుజరాత్‌లో దీనిని పైలట్ ప్రోగ్రామ్‌గా ప్రారంభించింది.
Read Also: Diabetes: ఉప్పు ఎక్కువగా వాడితే మధుమేహం!
గుజరాత్‌లోని అన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు(డీసీసీ) ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 41 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేయనున్నారు. ప్రతీ జిల్లాకు ఒక ఏఐసీసీ పరిశీలకుడిని నియమించారు. ప్రతీ జిల్లాకు నలుగురు పీసీసీ పరిశీలకుల టీంని నియమించారు. ప్రక్షాళన ప్రక్రియ కోసం మొత్తం 43 మంది ఏఐసిసి పరిశీలకులు, 183 మంది పీసీసీ పరిశీలకులు నియామకం జరిగింది.
వచ్చే మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తొలి సమావేశం జరుగనుంది. ఏఐసిసి సమావేశాల్లో తీసుకున్న విధానపరమైన నిర్ణయం ప్రకారం పార్టీ ప్రక్షాళన ప్రక్రియ ప్రారంభించింది. గుజరాత్ లో ఆరావళి జిల్లాలోని మొడాసా పట్టణంలో, వచ్చే మందళవారం (ఏప్రిల్ 15) మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులతో తొలి సమావేశం జరుగుతుంది. గుజరాత్ కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసిసి ఇంచార్జ్ సెక్రటరీ లు, వారికి కేటాయించిన జోన్ల లో తొలి సమావేశం నిర్వహించనున్నారు.