Rajasthan: అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్య కీలక భేటీ.. ఆనందంలో రాజస్థాన్ కాంగ్రెస్
- మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ తో సచిన్ పైలెట్ సమావేశం..
- గెహ్లాట్ ను రాజేశ్ పైలట్ 25వ వర్ధంతి కార్యక్రమానికి ఆహ్వానించిన మాజీ డిప్యూటీ సీఎం..
- అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ కలవడంతో రాజస్థాన్ కాంగ్రెస్ శ్రేణులు ఆనందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలంటే మొదట మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాలే గుర్తుకు వస్తాయి. ఈ క్రమంలో శనివారం వీరిద్దరూ సమావేశం అయ్యారు. గెహ్లాట్ నివాసంలో జరిగిన ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ అంశంపై ఇద్దరు నేతలు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టులు పెట్టారు. తన తండ్రి, మాజీ కేంద్రమంత్రి రాజేశ్ పైలట్ 25వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహ్వానించడానికి మాజీ సీఎంను కలిశాను అని సచిన్ తెలపగా.. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను అశోక్ గెహ్లాట్ షేర్ చేశారు. రాజేశ్ పైలట్‌తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
Read Also: Akhanda 2 : ‘అఖండ2’ టీజర్‌కు టైమ్ టూ డేట్ ఫిక్స్..
Also Read
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
అయితే, 1980లో రాజేశ్, తాను ఒకేసారి లోక్‌సభలో అడుగు పెట్టామన్నారు మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. తమ మధ్య 18 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. రాజేశ్ ఆకస్మిక మరణం తనను ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. మరోవైపు అశోక్- సచిన్ పైలెట్ మధ్య సయోధ్య కుదిరిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. రాజేశ్ పైలట్ వర్ధంతి కార్యక్రమంలో గెహ్లాట్ పాల్గొంటే.. అది రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో మంచి పరిణామమేనని ఆ పార్టీ నేత ఒకరు వెల్లడించారు.
Read Also: Maganti Gopinath: మాగంటి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది: నారా లోకేష్
కాగా, 2018 నుంచి అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్ల మధ్య ఆదిపత్య పోరు నడుస్తుంది. 2020లో ముఖ్యమంత్రిగా ఉన్న గెహ్లాట్ పై అసమ్మతి స్వరం వినిపిస్తూ.. నాడు డిప్యూటీ సీఎంగా ఉన్న సచిన్ పైలట్‌తో పాటు మరో 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా.. దాదాపు నెల రోజుల పాటు ఈ రాజకీయ సంక్షోభం కొనసాగింది. ఆ తర్వాత వీరు ఇద్దరూ పరస్పర విమర్శలు సైతం చేసుకున్నారు. దీంతో ఈ గొడవ మరింత ముదిరింది. కాంగ్రెస్ పార్టీ పెద్దలు వీరి మధ్య సఖ్యత కుదుర్చేందుకు ట్రై చేసినప్పటికీ.. అది ఫలించలేదు.
AICC महासचिव श्री @SachinPilot ने आवास पर पूर्व केन्द्रीय मंत्री स्व. श्री राजेश पायलट की 25वीं पुण्यतिथि पर आयोजित कार्यक्रम के लिए आमंत्रित किया।
मैं और राजेश पायलट जी 1980 में पहली बार एक साथ ही लोकसभा पहुंचे एवं लगभग 18 साल तक साथ में सांसद रहे। उनके आकस्मिक निधन का दुख हमें… pic.twitter.com/GPLuXMtLKw
— Ashok Gehlot (@ashokgehlot51) June 7, 2025
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!