నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా మూవీ ‘అఖండ 2’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’ కు సీక్వెల్ ఇది. అఘోరీగా నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ప్రదర్శించి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో తాజాగా..ఈ సినిమా టీజర్ విడుదల తేదీని ప్రకటించారు..14 రీల్స్ ప్లస్ యూనిట్. జూన్ 9న (సోమవారం) సాయంత్రం 6:03 నిమిషాలకు టీజర్ విడుదల అవుతుందని వెల్లడించింది. అఖండ తాండవం ఆరంభమవుతుందని పేర్కొంది.