South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- దక్షిణ పసిఫిక్ సముద్రంలో ప్రమాదం
- తిమింగలం ఢీకొట్టడంతో మునిగిన యాచ్
- 18 గంటలు లైఫ్రాఫ్ట్లో నలుగురు నావికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సముద్రంలో సరదాగా సాగాల్సిన ఓ ప్రయాణం ఒక్కసారిగా తల్లకిందులైంది. 18 గంటల పాటు ప్రాణాలతో పోరాటం చేయాల్సి వచ్చింది. దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఓ భారీ తిమింగలం యాచ్‌ను ఢీకొట్టడంతో అది తీవ్రంగా దెబ్బతిని నీటిలో మునిగిపోయింది. దీంతో నలుగురు నావికులు లైఫ్రాఫ్ట్లోకి చేరి సుమారు 18 గంటల పాటు సముద్రంలోనే గడిపారు. చివరకు ఓ కార్గో నౌక వారిని సురక్షితంగా రక్షించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆస్ట్రేలియా జెండాతో ప్రయాణిస్తున్న 51 అడుగుల పొడవైన Tai Tam అనే యాచ్ సెప్టెంబర్ 26న నార్ఫోక్ ఐలాండ్‌కు సుమారు 250 నాటికల్ మైళ్ల ఉత్తరాన ప్రయాణిస్తోంది. ఆ సమయంలో యాచ్ చుట్టూ తిమింగలాల గుంపు కనిపించినట్లు నావికులు తెలిపారు. కొద్దిసేపటికే యాచ్‌ను భారీ తిమింగలం ఢీకొట్టినట్లు భావించారు. ఢీకొన్న వేగానికి యాచ్ స్టీరింగ్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అంతేకాకుండా హల్కు పగుళ్లు ఏర్పడి సముద్రపు నీరు లోపలికి ప్రవేశించడం ప్రారంభమైంది. మొదట నావికులు యాచ్‌ను తేలియాడేలా చేసేందుకు ప్రయత్నించారు. కానీ హల్లోకి నీరు వేగంగా రావడంతో పరిస్థితి క్రమంగా అదుపు తప్పింది. దీంతో నలుగురు సిబ్బంది అత్యవసర రక్షణ చర్యలకు దిగారు. ఎమర్జెన్సీ పొజిషన్-ఇండికేటింగ్ రేడియో బీకన్ (EPIRB)ను యాక్టివేట్ చేయడంతో పాటు ‘మేడే’ అత్యవసర సందేశాన్ని పంపారు. అనంతరం యాచ్‌ను విడిచిపెట్టి లైఫ్రాఫ్ట్లోకి చేరారు.
Also Read
- Ukraine: ‘‘పుతిన్‌ను బుజ్జగించడం కన్నా ఇలా చేయండి’’..ట్రంప్, జిన్పింగ్లకు ఉక్రెయిన్ విజ్ఞప్తి
- Bilawal Bhutto: ఇమ్రాన్ ఖాన్‌పై ఇంకెంత ప్రతీకారం తీర్చుకుంటారు?.. పాక్ రాజకీయాల్లో భుట్టో కలకలం!
- Voyager 1: చరిత్ర సృష్టించిన వయోజర్-1 .. నేటితో ‘‘ఒక కాంతి రోజు’’ దూరంలోకి..
- ASEAN Summit: మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్‌దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?
నలుగురు నావికులు లైఫ్రాఫ్ట్లో సముద్రంలో ఉండగా.. వారి ఆచూకీ కోసం న్యూజిలాండ్ రక్షణ అధికారులు రంగంలోకి దిగారు. న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్‌కు చెందిన P-8A Poseidon నిఘా విమానాన్ని సంఘటనా స్థలానికి పంపించారు. విమానం నావికుల ఆచూకీ గుర్తించడంతో పాటు వారితో రేడియో ద్వారా సంబంధాలు ఏర్పాటు చేసింది. రక్షణ కోసం సమీపంలోని పలు నౌకలను కూడా దారి మళ్లించారు. చివరకు 143 మీటర్ల పొడవైన MV Sofrana Surville అనే కార్గో నౌక సెప్టెంబర్ 27 ఉదయం సుమారు 6 గంటలకు నావికుల దగ్గరకు చేరుకుంది. అప్పటికే వారు ఎన్నో గంటల పాటు బహిరంగ సముద్రంలో లైఫ్రాఫ్ట్లోనే గడిపారు. నలుగురినీ కార్గో నౌకలోకి తీసుకుని సురక్షితంగా రక్షించారు.
ఆస్ట్రేలియా నావికురాలు జెమ్మా కూపర్ మాట్లాడుతూ.. ఢీకొన్న తీవ్రతకు తాను స్టీరింగ్ దగ్గర నుంచి ఎగిరిపడినట్లు గుర్తుచేసుకున్నారు. ఆమె భర్త జెరెమీ కూపర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాచ్ స్టీరింగ్ గేర్ పూర్తిగా ధ్వంసమై, పెద్ద మొత్తంలో నీరు లోపలికి వచ్చింది. మరో సిబ్బంది సభ్యుడు మార్టిన్ జాఫ్రే నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. హల్లో దెబ్బతిన్న కొన్ని ప్రాంతాలను విస్తరించే ఫోమ్‌తో మూసివేసేందుకు కూడా ప్రయత్నించినట్లు తెలిపారు. అయితే నీటి ప్రవాహాన్ని పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాలేదు. పరిస్థితి మరింత విషమించడంతో నలుగురు నావికులు చివరకు యాచ్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. లైఫ్రాఫ్ట్లోకి చేరిన వారు తమ యాచ్ సముద్రంలో మునిగిపోవడాన్ని చూస్తూ ఉండిపోయారు. Tai Tam పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. అయితే ఈ ఘటనలో నలుగురూ ఎలాంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడ్డారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..